వారం రోజులుగా తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. బయటకు రావాలంటే ప్రజలు భయపడిపోతున్నారు. అధిక ఎండల కారణంగా పలు చోట్ల అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్న విషయం తెలిసిందే.
గత వారం రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. భానుడి ప్రతాపంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల 45 డిగ్రీలకు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఈనేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఎండల ప్రభావం వల్ల పలు చోట్ల అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా అత్తాపూర్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
అత్తాపూర్ లోని బాడీ బిల్డింగ్ షోరూం లో అకస్మాత్తగా మంటలు చెలరేగాయి. దీంతో చుట్టుపక్కల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ విషయాన్ని పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి తెలియజేయంతో వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని అక్కడి పరిస్థితులు పరిశీలించారు. ప్రస్తుతం మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు అగ్నిమాపక సిబ్బంది. అయితే అగ్ని ప్రమాదం ఎలా జరిగింది అనే విషయం తెలియాల్సి ఉంది. మంటల కారణంగా దట్టమైన పొగ వ్యాపించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందికి గురైనట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.