ఖమ్మం జిల్లాలో బీఆర్‌ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో పెను విషాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. పార్టీ సంబరాల సదర్భంగా కార్యకర్తలు పేల్చిన బాణసంచా ఘోర ప్రమాదానికి దారి తీసింది. బాణసంచా కారణంగా గుడిసెలో లో పేలుడు సంభవించి ఇద్దరు మృతి చెందగా.. పదికి పైగా మందిని తీవ్రంగా గాయపరిచింది. ఈ ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఖమ్మం జిల్లాలో బీఆర్‌ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో పెను విషాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. పార్టీ సంబరాల సదర్భంగా కార్యకర్తలు పేల్చిన బాణసంచా ఘోర ప్రమాదానికి దారి తీసింది. బాణసంచా కారణంగా గుడిసెలో లో పేలుడు సంభవించి ఇద్దరు మృతి చెందగా.. పదికి పైగా మందిని తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఈ వార్త రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఆత్మీయ సమ్మేళనంలో పేలింది ఒక్క సిలిండరేనా?. ఒక్క సిలిండర్ అయితే ఇంత బీభత్సం ఎలా జరిగిందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
బుధవారం ఖమ్మం జిల్లాలోని వైరా నియోజకవర్గం చీమలపాడులో బీఆర్‌ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సమ్మేళనంలో ఎంపీ నామా నాగేశ్వరరావు, స్థానిక ఎమ్మెల్యే రాములు నాయక్, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే కొందరు బాణ సంచాలను పేలుస్తూ సందడి చేశారు. ఈ క్రమంలో వాటిల్లోని ఓ తారాజువ్వ ఎగిరి పక్కనే ఉన్న పూరి గుడిసెపై పడింది. తారాజువ్వ రాజేసిన నిప్పు కారణంగా గడిసె మంటలు అంటుకున్నాయి. దీంతో ఆ వెంటనే లోపల ఉన్న గ్యాస్ సిలిండర్ కూడా భారీ శబ్ధంతో పేలిందని సమాచారం.
ఈ పేలుడు ధాటికి ఇద్దరు చనిపోగా.. దాదాపు 10 మందికి పైగా గాయపడ్డారు. గాయాలపాలైన వారిలో పోలీసులు, జర్నలిస్టులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు. గాయపడిన వారిలో కొంతమంది కాళ్లు, చేతులు తెగి, ఎగిరిపడటం అక్కడి అందరిని కలిచివేసింది. ఇక, ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పేలింది ఒక్క సిలిండరేనా?, అలా అయితే ఇంత బీభత్సవం ఎలా జరిగింది అంటూ అనేక సందేహాలు వ్యక్తమతున్నాయి.
గతంలో అనేక గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనల జరిగాయి కానీ.. ఇంతలా ఎక్కడ బీభత్సం జరిగిన దాఖలాలు లేవు. అయితే ఖమ్మంలో జరిగిన ఈ విషాదంలో సిలిండర్ తో పాటు అక్కడ ఏమైన నల్లమందు నిల్వ ఉంచారా? అనే అనుమానులు వ్యక్తమవుతున్నాయి. అలానే ఒక్కటి కాకుండా ఎక్కువ సిలిండర్లు ఏమైనా ఆ గుడిసెలో ఉన్నాయా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఎవరి సందేహాలు ఏమైనప్పటికి అసలు ఏం జరిగింది అనేది తెలియాల్సి ఉంది. ఈ ఘోర విషాదంతో తెలంగాణ రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మరి.. ఈ విషాదంపై వస్తున్న సందేహాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.