మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని ఎంత ప్రచారం చేసినా.. జనాల్లో మార్పు రావడం లేదు. ఒకప్పుడు మద్యం సేవించడాన్ని పాపంగా చూస్తే.. ఇప్పుడది ఫ్యాషన్‌గా మారింది. తాగనివారు.. దేనికి పనికిరాని వారు అనే ముద్ర వేస్తున్నారు. ప్రస్తుతం చాలా చోట్ల ఆడ, మగా అనే తేడా లేకుండా మందు తాగుతున్నారు. ఇక ప్రభుత్వాలు మైనర్లకు మందు అమ్మకూడదని చెప్పినప్పటికి చాలా చోట్ల ఆ నియమాన్ని పాటించడం లేదు. ఫలితం.. టీనేజ్‌లోకి అడుగుపెట్టినప్పటి నుంచే మద్యపానానికి అలవాటు పడుతున్నారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగు చూసింది. బీసీ హాస్టల్‌లో కొందరు విద్యార్థులు.. బీర్లు, చికెన్‌తో విందు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయడంతో ఈ సంఘటన వెలుగు చూసింది. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి: వామ్మో వీడి తెలివి తగలెయ్య.. విగ్గులో దాచి బంగారం స్మగ్లింగ్!
మంచిర్యాల బీసీ బాలుర వసతి గృహాంలో ఈ నెల 17న ఆదివారం విద్యార్థులకు చికెన్ వండారు. దీంతో కొందరు విద్యార్థులు రాత్రి భోజనాన్ని గదిలోకి తీసుకెళ్లారు. ఇక స్థానిక విద్యార్థుల సాయంతో బీర్లు తెప్పించుకుని గదిలో వాటిని తాగుతూ సెల్‌ఫోన్లలో ఫోటోలు దిగారు. ఇవి కాస్త వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ కావడంతో కొందరు యువకులు దీని గురించి కలెక్టర్, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం కోసం వాట్సాప్‌తో పాటు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. విషయం తెలిసిన జిల్లా బీసీ సంక్షేమ అధికారి ఖాజా నజీం అలీ అఫ్సర్ ఈ ఘటనపై బుధవారం విచారణకు ఆదేశించగా.. అసిస్టెంట్ బీసీ డెవలప్‌మెంట్ అధికారి భాగ్యవతి హాస్టల్‌ను సందర్శించి వార్డెన్ మల్లేశ్‌తోపాటు సిబ్బందిని విచారించారు. నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తానని తెలిపారు. ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: షాపింగ్ మాల్ కక్కుర్తి.. రూ.12 కోసం ఆశపడితే… 21 వేలు చెల్లించాల్సి వచ్చింది!
ఇది కూడా చదవండి: వైద్యులు దీర్ఘకాలిక సెలవు పెడితే కొలువుకి సెలవే..!