బిడ్డను చేతుల్లోకి తీసుకొని మురిసిపోయేది తండ్రయినా.. ఆ బిడ్డను నవమోసాలు మోసి.. పురిటి నొప్పి బాధలు భరిస్తూ జన్మనిచ్చేది తల్లి మాత్రమే. అలాంటి బాధలు అనుభవిస్తూ ఓ తల్లి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కానీ, దుర్మార్గపు ఆలోచన ఉన్న భర్తకు అది సంతృప్తినివ్వలేదు. మళ్ళీ ఆడబిడ్డకు జన్మనిస్తావా..? అంటూ వారిని హాస్పిటల్లోనే వదిలి వెళ్లిపోయాడు.
నవమాసాలు మోసిన ఆ ఇల్లాలు పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డను చేతుల్లోకి తీసుకొని మనసారా ముద్దాడాలనుకుంది. అంతలోనే వందేళ్లు నీతో తోడుంటానని చెప్పి ఏడడుగులు నడిచిన భర్త కనపడకుండా పోయాడు. ఎక్కడికి పోయాడా..? అని ఆరాతీస్తే గుండె పగిలే వార్త అందింది. ఆడపిల్ల పుట్టిందని వదిలించుకునే ప్రయత్నం చేశాడని తెలుసుకొని ఆ తల్లి మనసు తల్లడిల్లి పోయింది. ఈ అమానుష ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది.
కరీంనగర్ పట్టణానికి చెందిన కావ్య-రాజ్ కుమార్ దంపతులకు మూడేళ్ల క్రితం వివాహమయ్యింది. ఎంతో సంతోషంగా జీవితాన్ని ఆరంభించిన ఈ దంపతులకు మొదట సంతానంగా ఆడపిల్ల జన్మించింది. ఈ క్రమంలో కావ్య రెండో సారి గర్భందాల్చగా, భర్త మగబిడ్డకు జన్మనిస్తుందని భావించాడు. ఆ సమయం రానే వచ్చింది. నవమాసాలు మోసిన ఆ తల్లి.. పురిటి నొప్పులు దిగమింగుకొని ఆ తల్లి పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. కానీ, ఆ ప్రబుద్దుడికి అది నచ్చలేదు. రెండోసారి ఆడపిల్లే పట్టిందని వారిని హాస్పిటల్లోనే వదిలి వెళ్లిపోయాడు. అప్పటినుండి అతడి జాడ లేకపోవడంతో తండ్రితో కలిసి పోలీస్ స్టేషన్ కు చేరుకున్న కావ్య భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారం చేపట్టారు. ఈ దుర్మార్గపు భర్తపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.