రైలు ప్రమాదాల కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు నిత్యం మనం అనేకం చూస్తునే ఉన్నాము. కొందరు కావాలనే రైలు కింద పడి ఆత్మహత్య కు పాల్పడుతున్నారు. మరికొందరు మాత్రం అనుకోకుండా రైలు ప్రమాద బారిన పడి మరణిస్తున్నారు. కానీ తాజాగా ఓ వ్యక్తి మాత్రం ప్రాణాలతో బయట పడ్డాడు.
రైలు ప్రమాదాల కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు నిత్యం మనం అనేకం చూస్తునే ఉన్నాము. కొందరు కావాలనే రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. మరికొందరు మాత్రం అనుకోకుండా రైలు ప్రమాద బారిన పడి మరణిస్తున్నారు. అయితే కొందరు మాత్రం మృత్యువు అంచుల వరకు వెళ్లి .. తిరిగి వస్తున్నారు. రైలు కింద పడి.. ఏ మాత్రం చిన్న గాయం కాకుండా బతికి బట్టకట్టిన వాళ్లు కూడా ఉన్నారు. తాజాగా ఓ వ్యక్తి పట్టాలపై పడిపోగా అతని పై నుంచి రైలు వెళ్లింది. భూమి మీద నూకలుండి ఆయన బతికి బయటపడ్డాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
భూమి మీద నూకలు ఉంటే ఎంత ఘోర ప్రమాదం జరిగిన ప్రాణాలతో బయట పడుతుంటారు. ఖమ్మం జిల్లాలో ఓ వృద్ధుడ్ని విషయంలో అదే జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆయన రైలు పట్టాలు దాటుతూ ఉండాగా గూడ్స్ రైలు కింద పడిపోయాడరు. విచిత్రం ఏమిటంటే ఆయన రెండు పట్టాల మధ్యలో పడి ఉండగానే గూడ్స్ రైలు బోగీలు వరుసగా ఆయన పైనుంచి వెళ్లాయి. ప్రమాదంలో ఆయనకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
అయితే రైలు తనపై నుంచి వెళ్తున్న సమయంలో తల ఎత్తకుండా ట్రాక్ పై పడుకున్నాడు. ఈక్రమంలో కొన్ని బోగీలు ఆయన పై నుంచి వెళ్లిన తరువాత రైలు ఆగిపోయింది. దీంతో స్టేషన్ లో ఉన్న కొందరు ఆ వృద్ధుడిని బోగి కింద నుంచి నెమ్మదిగా బయటకు తీశారు. అయితే అంతముందు ఆ వృద్ధుడు బంధువులు.. ఆయన ప్రాణాలు కోల్పోయాడనే భావనతో గుండెలు పగిలేలా రోదించారు. చివరకు తోటి ప్రయాణికులు కాపాడటంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.
పెద్ద వయస్సు కలిగిన ఓ వ్యక్తి రైలు ట్రాక్ దాటేందుకు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. అయితే భూమి మీద నూకలు మిగిలి ఉన్నాయి కాబట్టి ప్రాణాలతో బతికి బయటపడ్డాడు. రైల్వే స్టేషన్‌లో, కదులుతున్న రైలును ఎక్కడం మంచిది కాదు. అలానే రైలు వస్తున్న సమయంలో అతివిశ్వాసంతో ట్రాక్ దాటే ప్రయత్నం చేయడం మంచిది కాదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.