ప్రతి ఒక్కరు కష్టపడి చదివి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరుకుంటారు. ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డలు మంచి ఉద్యోగం సంపాందించి బాగా స్థిరపడాలని కోరుకుంటారు. చాలా మంది యువత తమ ప్రతిభతో అనేక గొప్ప అవకాశాలను అందిపుచ్చుకుంటూ మంచి స్థాయికి వెళ్తున్నారు. కొందరు అయితే కోట్లలో వార్షిక వేతనం ఇచ్చే కొలువు సంపాదించి.. తమ కుటుంబంతో, ఆ ప్రాంతాన్నికి మంచి పేరు తెస్తున్నారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెందిన ఓ యువకుడు రూ.2 కోట్ల వార్షిక వేతనంతో అమెరికాలో కొలువు సాధించాడు. దీంతో అతని కుటుంబ సభ్యుల ఆనందనికి అవధులులేవు. వివరాల్లోకి వెళ్తే..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలోని గౌతమీనగర్ చెందిన అభిరాం రెడ్డి(30) అమెరికాలోని ప్రతిష్ఠాత్మక ఇంటెల్ లో జాబ్ సంపాందించాడు. వార్షిక వేతనంగా అతను రూ.2 కోట్లు తీసుకోనున్నాడు. అశ్వాపురంలోని గౌతమీనగర్ లోని అణుశక్తి కేంద్ర పాఠశాలలో అభిరాం పదో తరగతి వరకు చదువుకున్నాడు. అనంతరం యూనివర్సిటీ ఆఫ్ మెసాచుసెట్స్ లో పాలిమర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో పీహెచ్ డీ పూర్తి చేశాడు. మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో పోస్ట్ డాక్టరేట్ పూర్తి చేసి ఈనెలలో అమెరికాలోని ప్రతిష్ఠాత్మక ఇంటెల్ కంపెనీలో రీసెర్చ్ సైంటిస్టుగా రూ.2 కోట్ల వార్షిక వేతనంతో ఉద్యోగం దక్కించుకున్నాడు. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.