దేశ వ్యాప్తంగా గుండెపోటు మరణాలు రోజు రోజుకు ఎక్కువవుతున్నాయి. తాజాగా సంగారెడ్డి జిల్లాలో సైతం ఓ వ్యక్తి హార్ట్ ఎటాక్ తో మరణించాడు
గత కొన్ని నెలల నుంచి వరుస గుండెపోటు మరణాలు ప్రజలను తీవ్ర భయందోళనలకు గురి చేస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకూ అందరూ హార్ట్ ఎటాక్ తో మరణిస్తున్నారు. క్రికెట్ ఆడుతూ, డ్యాన్స్ చేస్తూ ఇలా చాలా మంది గుండెపోటుతో కుప్పకూలుతున్నారు. తాజాగా సంగారెడ్డిలో ఓ వ్యక్తి హార్ట్ ఎటాక్ తో మరణించాడు. ఇతని మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
సంగారెడ్డి జిల్లాలోని ఓ ప్రాంతంలో సుశీల్ కుమార్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతడు సంగారెడ్డి టీఎన్ జీఓ సంఘం జిల్లా అధ్యక్షుడిగా పని చేస్తున్నారు. అయితే సుశీల్ కుమార్ బుధవారం విధులు ముగించుకుని సాయంత్రం ఇంటికి వెళ్లారు. ఇక ఇంటికి వెళ్లగానే ఉన్నట్టుండి అతడు గుండెలో నొప్పిగా ఉందంటూ కుప్పకూలాడు. వెంటనే స్పందించిన కుటుంబ సభ్యులు అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు.. అతడు అప్పటికే గుండెపోటుతో మరణించాడని నిర్ధారించారు. ఇతని మరణవార్తతో మృతుడి భార్యా, పిల్లలతో పాటు కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా ఏడ్చారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. వరుస గుండెపోటు మరణాలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.