ఈ మధ్యకాలంలో హార్ట్ ఎటాక్ మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. తాజాగా సంగారెడ్డి జిల్లాలో ఓ వ్యక్తి గుండెపోటుతో ప్రాణాలు విడిచాడు. అతని మరణంతో కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.
గత కొన్ని రోజుల నుంచి వరుస గుండెపోటు మరణాలు ప్రజలను భయందోళనలకు గురి చేస్తున్నాయి. వయసుతో సంధం లేకుండా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకూ హార్ట్ ఎటాక్ తో ఉన్నట్టుండి కుప్పకూలి ప్రాణాలు విడిస్తున్నారు. అచ్చం ఇలాగే తాజాగా మరో వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. దుబ్బాకలో చోటు చేసుకున్న ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. సంగారెడ్డి జిల్లా దుబ్బాక పరిధిలోని మిరుదొడ్డి. ఇదే గ్రామంలో పయ్యావుల బాల్ రాజ్-లక్ష్మి దంపతులు నివాసం ఉంటున్నారు.
వీరికి ఓ కుమారుడు, కూతురు సంతానం. బాల్ రాజ్ స్వగ్రామంలోనే కటింగ్ షాపును నడిపిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. అయితే ఆదివారం తెల్లవారు జామున బాల్ రాజ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే స్పందించిన అతని కుటుంబ సభ్యులు హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇక చికిత్స అందించిన వైద్యులు.. బాల్ రాజ్ గుండెపోటుతో మరణించాడని తెలిపారు. ఈ వార్త తెలుసుకున్న అతని భార్య, పిల్లలు గుండెలు పగిలేలా ఏడ్చారు. ఉన్నట్టుండి బాల్ రాజ్ హార్ట్ ఎటాక్ తో మరణించడంతో అతని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వరుస గుండెపోటు మరణాలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.