మనిషి కష్ట పడితే సాధించలేనిదంటూ ఏమి ఉండదని మన పెద్దలు అంటుంటారు. అలానే ఎందరో స్వయం కృషితో కష్టపడి ఉన్నత స్థాయి చేరుకున్నారు. చాలా మంది రేయింబవళ్లు కష్టపడి పేదరికాన్ని సైతం జయించి.. ధనవంతులుగా మారిపోయారు. అలానే తాజాగా ఓ సాధారణ పాల వ్యాపారి కష్టపడి జీవితంలో ఉన్నత స్థితికి ఎదిగాడు.
మనిషి కష్ట పడితే సాధించలేనిదంటూ ఏమి ఉండదని మన పెద్దలు అంటుంటారు. అలానే ఎందరో స్వయం కృషితో కష్టపడి ఉన్నత స్థాయి చేరుకున్నారు. చాలా మంది రేయింబవళ్లు కష్టపడి పేదరికాన్ని సైతం జయించి.. ధనవంతులుగా మారిపోయారు. అలానే తాజాగా ఓ సాధారణ పాల వ్యాపారి కష్టపడి జీవితంలో ఉన్నత స్థితికి ఎదిగాడు. తమ్ముడి పెళ్లికి బంధువులను ఆహ్వానించేందుకు హెలికాప్టర్ ను సైతం వినియోగించాడు. మరి.. ఓ మాములు పాల వ్యాపారి హెలికాప్టర్లో పెళ్లి పిలుపు వెళ్లడం ఎలా సాధ్యపడింది. ఆ హెలికాప్టర్ వినియోగాన్నికి ఎన్ని కోట్లు ఖర్చు చేశారు?. ఆ పూర్తి వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
తన తమ్ముడి పెళ్లిని ధూమ్ ధామ్‌గా నిర్వహించాడు హైదరాబాద్ లోని ఖైరతాబాద్‌కు చెందిన మధు యాదవ్ అనే వ్యాపారి. అతడు దూద్ వాలా పేరుతో ఓ డైరీ ఫాం నిర్వహిస్తున్నాడు. అతడి తమ్ముడు చందు యాదవ్ వివాహం ఎంతో ఘనంగా జరిపించాడు. అయితే పెళ్లికి ముందు బంధువులను తానే స్వయంగా వెళ్లి ఆహ్వానించాడు. అలానే ముంబయిలో ఉన్న స్నేహితులు, బంధువులకు కూడా పెళ్లి పత్రికలు స్వయంగా అందించాలని భావించి.. ఏకంగా హెలికాఫ్టర్‌నే బుక్ చేశాడు మధు యాదవ్. దీంతో మధు యాదవ్ ఒక్కసారిగా వార్తలో నిలిచాడు.
అయితే తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్యూల్లో తనకు గురించి అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అలానే హెలికాప్టర్ అయిన ఖర్చుల వివరాలు కూడా షేర్ చేసుకున్నారు. తాను తొలుత పాల వ్యాపారం చేసేవాడని, ఆ తరువాత లిక్కర్ బిజినెస్ కూడా చేశానని తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ..”పాల ఉత్పత్తిపై ఉన్న ఆసక్తితోనే ఈ వ్యాపారం చేస్తున్నాము. అలానే పాల వ్యాపారంతో పాటు లిక్కర్ వ్యాపారం కూడా చేస్తున్నాము. అయితే పాల వ్యాపారం ప్యాషన్ కోసం చేస్తున్నాము. లిక్కర్ బిజినెస్ డబ్బుల కోసం చేస్తున్నాము. రెండిటిని సమాంతరం గా నడిపిస్తున్నాము. అందరు మమ్మల్ని ప్రేమతో దూద్ వాలా అని పిలుస్తుంటారు. మాకు 100 వరకు ఆవులు, 800 గేదెలు ఉన్నాయి.
ఉదయం 5 గంటల నుంచి మాకు పని ప్రారంభమవుతుంది. మాకు జంతువుల మీద ప్రేమతోనే ఈ పాల వ్యాపారం పెట్టాము. 800 గేదెల్లో పాలిచ్చేవి కేవలం 300 మిగిలినవి మాములువే. అవి చాలా ఉత్తమైన గేదెలు కావడంతో వాటిని అమ్మడానికి మనస్సు ఒప్పుకోదు. అందుకే వాటిని అమ్మకుండా సొంత కన్న బిడ్డలా చూసుకుంటున్నాము. వాటికి ఎంతో సహజ సిద్ధమైన ఆహారం, వివిధ పోషక పదార్ధులు అందిస్తున్నాము. ఈ మూగజీవాలను మా ఇంటి మనుషుల చూసుకుంటాము. ప్రస్తుతం సిటీలో ఉంటే పెద్ద పెద్ద హోటళ్లకు మా డైరీ ఫామ్ నుంచే పాలు సప్లయ్ చేస్తున్నాము.
ఈ రెండు వ్యాపారాల ద్వారా మంచి విజయం సాధించాము. నా తమ్ముడి పెళ్లి ఘనంగా చేయలని భావించాను. పెళ్లి పిలుపు కోసం హెలికాప్టర్ ను వినియోగించాము. ఇక ఈ హెలికాప్టర్ కు గంటల లెక్కన అద్దె చెల్లిస్తున్నాము. గంటకు రూ.3 లక్షల చొప్పున ఒక నెల పాటు హెలికాప్టర్ ను అద్దెకు తీసుకున్నాము” అంటూ తనకు సంబంధించిన విషయాలు మధు యాదవ్ వెల్లడించారు. మరి.. మధు యాదవ్ చెప్పిన మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.