మద్యం బాబులకు బ్యాడ్ న్యూస్. ధరలు పెరుగుతున్నాయనుకుంటారా.. అలాంటిదేమీ లేదు కానీ నగరంలో ఓ రోజు మద్యం దుకాణాలు బంద్ అవుతున్నాయి. గాంధీ జయంతి, స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర్య దినోత్సవాలు ఏమీ లేవు కదా అని భావిస్తున్నారా.. అయితే ఎందుకు దుకాణాలు బంద్ అవుతున్నాయో ఈ వార్తపై ఓ లుక్ వేయండి
ఆరోగ్యాలు పాడైనా, అప్పుల పాలైనా మద్యం మత్తులో ఊగి తూగుతుంటారు మందు బాబులు. ఇలాంటి వారు ఒక్క పూట కూడా మందు తాగడకుండా ఉండలేరు. అలాంటి మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్. ధరలు పెరుగుతున్నాయనుకుంటారా.. అలాంటిదేమీ లేదు కానీ నగరంలో ఓ రోజు మద్యం దుకాణాలు బంద్ అవుతున్నాయి. అదేంటీ గాంధీ జయంతి, స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర్య దినోత్సవాలు ఏమీ లేవు కదా.. ఇప్పుడు దుకాణాలు బంద్ చేయడమేమిటనీ అనుకుంటున్నారా? అవునండీ.. గురువారం రోజున అనగా ఈ నెల 30వ తేదీన మద్యం దుకాణాలను మూసివేయాలని తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ నెల 30వ తేదీన శ్రీరామ నవమి ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ నగరంలో మద్యం అమ్మకాలపై కెసీఆర్ ప్రభుత్వం నిషేధాన్ని విధించింది. మద్యం షాపులను ఒకరోజు బంద్ చేయాలని ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నగరంలో మద్యం దుకాణాల బంద్. వైన్ షాపులు, కళ్ళు దుకాణాలు, బార్లు, రిజిస్టర్ క్లబ్లు ,పబ్లు ఇంక్లూడింగ్ ఫైవ్ స్టార్ హోటల్స్ లో బార్ రూమ్స్ మూసేయాలని ఆదేశించింది. గురువారం ఉదయం అనగా ఈ నెల 30వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 31 వ తారీకు ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు బంద్ చేయాలని తన ఉత్తర్వుల్లో పేర్కొంది. 24 గంటల పాటు మద్యం దుకాణాలతో పాటు బార్లు కూడా బంద్ చేయాలని నగర ఎక్సైజ్ శాఖ అధికారులు ఆదేశాలిచ్చారు. ఎవరైనా విక్రయాలు చేసినట్లు దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.