హైదరాబాద్ లోని నార్సింగిలో శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న సాత్విక్ అనే విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. సాత్విక్ మృతితో అతడి తల్లిదండ్రులు, స్నేహితులు తీవ్రవేదనకు గురయ్యారు. సాత్విక్ కేసులో రోజుకో కొత్త విషయం బయటకు వస్తుంది. తాజాగా మరో విషయం వెలుగులోకి వచ్చింది.
కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ లోని నార్సింగిలో శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న సాత్విక్ అనే విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. సాత్విక్ మృతితో అతడి తల్లిదండ్రులు, స్నేహితులు తీవ్రవేదనకు గురయ్యారు. కాలేజీలో ఒత్తిడి వల్లే తమ స్నేహితుడు ఉరి వేసుకున్నాడని తోటి విద్యార్థులు ఆరోపించారు. సాత్విక్ ఆత్మహత్య పాల్పడిన సమయంలో కాలేజీ యాజమాన్యం స్పందించలేదని, కనీసం ఆసుపత్రికి తీసుకెళ్లలేదని విద్యార్థులు ఆరోపించారు. సాత్విక్ ఆత్మహత్య పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. కాలేజిలో నీటి సమస్య ఉందని కాలేజీ సిబ్బందిని సాత్విక్ ప్రశ్నించాడని, అందుకే ఆ విద్యార్థిని టార్గెట్ గా చేసుకుని వేధించారనే వార్తలు వస్తున్నాయి.
ఇంటర్ విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య కేసుకి సంబంధించిన రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక విషయాలు వెల్లడైన సంగతి తెలిసిందే. కళాశాల వేధింపుల వల్లే సాత్విక్ ఆత్మహత్య చేసుకున్నాడని తేలింది. అయితే కాలేజీలో నీటి సమస్య గురించి సాత్విక్ కాలేజీ సిబ్బందిని ప్రశ్నించాడని, అందుకే అతడిని టార్గెట్ చేసి మరి.. వేధించినట్లు తెలుస్తోంది. తమను ప్రశ్నించాడనే సాత్విక్ పై కోపం పెంచుకుని తోటి విద్యార్థుల ముందు బూతులు తిడుతూ సాత్విక్ ను కొట్టారు. ఇంకా రిమాండ్ రిపోర్ట్ లో పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి. “లెక్చర్ ఆచారితో పాటు ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి తరచూ సాత్విక్ ను తిట్టడంతో మానసికంగా కుంగిపోయాడు. ఆత్మహత్య చేసుకునే రోజు కూడా సాత్విక్ ను కళాశాల సిబ్బంది చితకబాదారు.
ఆ రోజు తల్లిదండ్రులు వచ్చి సాత్విక్ తో మాట్లాడి వెళ్లారు. వారు వెళ్లిపోగానే.. ప్రిన్సిపల్, లెక్చర్ ఆచారీ… ఇంట్లో వారిని తిడుతూ విద్యార్థిని తీవ్రంగా కొట్టారు. హాస్టల్ లో సాత్విక్ ను వార్డెన్ నరేశ్ వేధించేవాడు” అని రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. రిమాండ్ నివేదిక కంటే ముందు ఇంటర్ బోర్డు అధికారులు సాత్విక్ ఆత్మహత్యపై ప్రభుత్వానికి ప్రాథమిక నివేదికను అందించారు. ఆ రిపోర్ట్ లో భాగంగా కాలేజిలో సాత్విక్ అడ్మిషన్ లేదని కమిటీ తెలిపింది. ఒక కాలేజీలో అడ్మిషన్.. మరో కాలేజీలో తరగతులు చెప్తుతున్నారు అని రిపోర్టులో స్పష్టం చేసింది. కాలేజీ వారి వేధింపులు నిజమేనని కమిటి తేల్చింది. మరి.. తాజాగా స్వాతిక్ కేసులో బయటకు వచ్చిన విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.