చాలా మంది డబ్బు సంపాదించాలనే ఆశతో కొంతమంది కేటుగాళ్ల మాయమాటల్లో పడి దారుణంగా మోసపోతుంటారు. సమాజంలో ప్రతిరోజు ఇలాంటి ఘటనలు ఎన్నో చూస్తూనే ఉంటాం. పైసా పైసా కూడబెట్టి డబ్బు ఆశతో మోసగాళ్ళ చేతుల్లో పెట్టి తాము మోసపోయామని తెలిసి లబో దిబో అంటూ స్టేషన్ మెట్లు ఎక్కుతుంటారు.
ఈ మద్య చాలా మంది డబ్బు సంపాదించడానికి ఎన్నో అక్రమాలకు పాల్పపడుతున్నారు. కొంతమంది దొంగతనాలకు పాల్పపడుతుంటే.. మరి కొంతమంది సైబర్ నేరాలకు పాల్పపడుతున్నారు. ఎదుటి వారి బలహీనతలను క్యాష్ చేసుకుంటూ కోట్లు దండుకుంటున్నారు. ముఖ్యంగా మద్యతరతి కుటుంబాల వారిని అధిక వడ్డీ ఆశ చూపించి కోట్లు మోసం చేసిన ఘరానా దొంగలు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారి చేతుల్లో మోసమోతున్నామని తెలిసి కూడా మళ్లీ అలాంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. తాజాగా ఓ మహిళ అధిక వడ్డీ ఆశ చూపించి మహిళలను దారుణంగా మోసి కోట్ల రూపాయలతో ఉడాయించింది. వివరాల్లోకి వెళితే..
డబ్బు అంటే ఎవరికి చేదు.. ప్రతి ఒక్కరూ ఉదయం లేచిన మొదలు పడుకునే వరకు డబ్బు సంపాదించే పనిలో ఉంటారు. మద్యతరగతి కుటుంబీకులు పైసా పైసా కూడబెట్టుకుంటూ తాము కన్న కలలు నెరవేర్చుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. కొంతమంది తమ డబ్బులు ఎక్కడ వడ్డీ వచ్చే చోట పెట్టుబడి పెడుతుంటారు. అలాంటి వారి ఆశ చూసి కొంతమంది మాయమాటలు చెప్పి అధిక వడ్డీ ఆశ చూపించి అందినంత దోచుకుంటారు. అచ్చం అలాంటి ఓ సంఘటన వనస్థలిపురంలో జరిగింది. ఓ మహిళ తనతో సన్నిహితంగా ఉంటున్న మహిళలకు లక్ష రూపాయలు ఇస్తే తక్కువ సమయంలో మరో లక్ష కలిపి ఇస్తానని ఆశ చూపించింది. అలా కిలాడీ మహిళ మాయమాటలో పడిపోయి చాలా మంది మహిళలు తమ డబ్బులో పొగొట్టుకొని లబో దిబో అంటున్నారు. రియల్ ఎస్టేట్, ఫైనాన్స్, చిటీల పేరుతో భారీ మోసానికి పాల్పపడిన ఓ మహిళపై వనస్థలిపురం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది.
హైదరబాద్ వనస్థలిపురం పరధిలో నివాసం ఉంటున్న స్వర్ణలత అనే మహిళ కొంత కాలంగా ఫైనాన్స్, రియల్ ఎస్టేల్ వ్యాపారాలు చేస్తుంది. ఈ క్రమంలోనే ఆమె చాలా మంది మహిళలతో స్నేహసంబంధాలు కొనసాగిస్తూ వచ్చారు. స్వర్ణలత డబ్బు సంపాదించే విధానం చూసి చాలా మంది మహిళలు ఆశ్చర్యపోయేవారు. ఈ క్రమంలోనే ఆమె రియల్ ఎస్టేట్ లో భారీగా పెట్టు బడులు పెడితో అధిక వడ్డీలు వస్తాయి.. లక్ష రూపాలు పెట్టుబడి పెడితే లక్ష తిరిగి చెల్లిస్తానని నమ్మబలికింది. స్వర్ణలత ఎప్పటి నుంచి స్థానికంగా ఉంటుంది.. ఆమె వద్ద డబ్బులు బాగా ఉన్నాయని చాలా మంది స్థానికులు ఆమెను నమ్మారు. ఇలా దాదాపు 50 మంది మహిళల నుంచి సుమారు 14 కోట్ల రూపాయల వరకు వసూళు చేసింది. అలా వసూళు చేసిన సొమ్ముతో చెప్పాపెట్టకుండా ఉడాయించింది.
అకస్మాత్తుగా స్వర్ణలత కనిపించకుండా పోవడంతో బాధిత మహిళలకు అనుమానం వచ్చింది. ఆమెకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ రావడంతో డబ్బుతో స్వర్ణలత ఉడాయించినట్లు భావించారు. తమ పిల్లల పెళ్లిళ్లు, ఎడ్యూకేషన్ కోసం దాచుకున్న డబ్బు స్వర్ణలత మాయమాటలు నమ్మి పెట్టుబడి పెట్టామని.. తాము దారుణంగా మోసపోయామని లబో దిబో అంటూ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు ఎల్బీ నగర్ డీసీపీ సాయి ని కలిసి తమ గొడు వెల్లబుచ్చారు. గతంలో స్వర్ణలతపై వనస్థలిపురం పోలీస్ స్టేషన్ లో ఓ చీటింగ్ కేసు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మహిళలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.