వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే సత్తా ఉన్నవారు కొందరే ఉంటారు. ఒత్తిడిని తట్టుకుని ఎదిరేగేవారు అరుదుగా ఉంటారు. ప్రజలు తమ మీద పెట్టుకున్న నమ్మకాలు, ఆశలు, అంచనాలను అందుకునే వారే విజేతలుగా నిలుస్తారు.
వారసత్వం అనేది చాలా రంగాల్లో ఉంది. కుటుంబ వ్యాపారాలు, రాజకీయాలు, సినీ పరిశ్రమ, క్రీడలు.. ఇలా చాలా రంగాల్లో వారసత్వం ఉంది. వారసులు కాబట్టే సులువుగా పెద్దస్థాయికి చేరుకుంటున్నారని విమర్శించే వారు ఎక్కువగా ఉన్నారు. అయితే వారసత్వం ఉన్నంత మాత్రాన రాణించడం అంత సులువు కాదని నిపుణులు అంటున్నారు. ఏ రంగంలోనైనా వారసత్వంతో అవకాశాలు మాత్రమే వస్తాయని.. ప్రతిభ ఉంటేనే రాణించగలరని చెబుతున్నారు. వారసత్వం ఉన్న వారిపై అంచనాలు, ఒత్తిడి కూడా అధికంగా ఉంటుందని.. దాన్ని తట్టుకుని నిలబడే సత్తా ఉన్నవారే ఉన్నతస్థాయికి చేరుకుంటారని అంటున్నారు. ఇదిలా ఉంటే.. తెలంగాణ రాజకీయాల్లో స్టార్ లీడర్‌గా ఉన్నారు కేటీఆర్. తండ్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చూపిన బాటలో నడుస్తూ ప్రజలకు సేవలు అందిస్తున్నారు కేటీఆర్.
నాన్న వల్ల రాజకీయాల్లోకి ఈజీగానే ఎంట్రీ ఇచ్చారు కేటీఆర్. కానీ మొదట్నుంచి ఆయన కష్టపడుతూ పైకి వచ్చారు. అమెరికా వెళ్లి ఉన్నత చదువులు చదువుకున్న కేటీఆర్.. తెలంగాణ ఉద్యమ సమయంలో స్వరాష్ట్రానికి చేరుకున్నారు. ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన అనంతరం ఆయన ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన హయాంలో తెలంగాణ ఐటీ రంగంలో దూసుకెళ్తోంది. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. మాటల్లోనే కాదు పనితీరులోనూ తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకున్న కేటీఆర్ చిన్నప్పటి ఫొటో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో ఆయన ముద్దొస్తున్నారు. తెల్ల చొక్కా, పొడువాటి హెయిర్ స్టయిల్‌తో ఉన్న కేటీఆర్ ఫొటోను ఆయన అభిమానులు బాగా షేర్ చేస్తున్నారు.