హైదరాబాద్ లోని మూషిరాబాద్ లోని ఓ ప్రాంతంలో సమయం దాటిన తరువాత కూడా రాత్రివేళ హోటళ్లు నడిపేందుకు పర్మిషన్ లేదని చెప్పిన పోలీసులపై ఓ కార్పొరేటర్ రెచ్చిపోయాడు. హద్దులు దాటి.. ఏం చేసుకుంటారో చేసుకొండి అంటూ నోరు పారేసుకున్నాడు. ఘటనపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన ఆ కార్పొరేటర్ పై చర్యలు తీసుకోవాలని డీజీపీకి మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివరాలోకి వెళ్తే..
సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత భోలక్ పూర్ లో తెరిచి ఉన్న దుకాణాలను మూసేయాల్సిందిగా స్థానిక పోలీసులు కోరారు. రంజాన్ సందర్భంగా దుకాణాలు తెరుచుకున్నామంటూ కొందరు దుకాణాదారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో అక్కడి వచ్చిన ఏంఐఎం కార్పొరేటర్ గౌసుద్దీన్ పోలీసులపై దుర్భాషలాడాడు. రంజాన్ నెల మొత్తం హోటళ్లు, షాపులను ముషిరాబాద్ ప్రాంతంలో తెరిచే ఉంచుతామంటూ కార్పొరేటర్ గౌసుద్దీన్ తాహా.. పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులకు అడ్డుకున్నాడు. సమయానికి హోటళ్లను మూసివేయాలని పోలీసులు చెప్పబోతే.. మీరు 100 రూపాయలకు పనిచేసే మనుషులు.. ఇక్కడకు కార్పొరేటర్ గౌసుద్దీన్ వచ్చాడని.. మీ ఎస్‌ఐ, సీఐకి చెప్పండి అంటూ రుబాబు ప్రదర్శించాడు.
రంజాన్ నెలపాటు ఇటు వైపు రావొద్దంటూ పోలీసులకు చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఘటనపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ సిటీలో మజ్లిస్ వాళ్లకు ఒక రూలు, ఇతరులకు మరో రూల్ ఉందా అంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పోలీసులను ప్రశ్నించారు. ఆ కార్పొరేటర్ పైచర్యలు తీసుకోవాలని రాజాసింగ్ డీజీపీ, హైదరాబాద్ సీపీకి ట్యాగ్ చేశారు. పోలీసులపై ఏంఐఎం కార్పొరేటర్ గౌసుద్దీన్ సహా కొందరు వ్యక్తులు దురుసుగా ప్రవర్తించిన ఘటనపై తగిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
A clear warning to @hydcitypolice not to enter his area for the next 30 days & abusing the officers on duty.
Too much freedom leads to this.
The video is from the Musheerabad area of Hyderabad city, @CPHydCity can we expect some action against such people. @TelanganaDGP pic.twitter.com/Am9dniF83E
— Raja Singh (@TigerRajaSingh) April 5, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.