ఇటీవల కాలంలో సినీతారల వారసులే కాదు.. పొలిటికల్ లీడర్ల వారసులు సైతం చిత్రపరిశ్రమ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటిదాకా వారసులుగా వచ్చి సక్సెస్ అయిన వాళ్ళను చాలామందిని చూశాం. ఇప్పుడిదే వరుసలో తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ తనయుడు, సీఎం కెసిఆర్ మనవడు హిమాన్షు చేరిపోయాడు.
సినీ ఇండస్ట్రీ అనగానే అందరూ హీరోహీరోయిన్లు, వాళ్ళ వారసులు, వారసురాళ్ల గురించే మాట్లాడుకుంటారు. అదంతా నెపోటిజమ్ అని.. ఇంకేదో ఏదో అని అంటుంటారు. కానీ.. టాలెంట్ ఉన్నప్పుడు, ఆ టాలెంట్ సరైన దారిలో ప్రెజెంట్ చేసే ప్రయత్నం చేసినప్పుడు.. ఖచ్చితంగా పేరు, గుర్తింపు అనేవి వాటంతటవే వస్తాయి. ఇండస్ట్రీలో ఎంతమంది వారసులు, వారసురాళ్లు ఉన్నా.. వారంతా అన్ని రంగాలలో రాణించకపోవచ్చు. అలాంటి టైంలో బయటి వాళ్లకు ఎక్కువగా అవకాశాలు వస్తుంటాయి. ఇటీవల కాలంలో సినీతారల వారసులే కాదు.. పొలిటికల్ లీడర్ల వారసులు సైతం చిత్రపరిశ్రమ వైపు మొగ్గు చూపుతున్నారు.
ఇప్పటిదాకా వారసులుగా వచ్చి సక్సెస్ అయిన వాళ్ళను చాలామందిని చూశాం. ఇప్పుడిదే వరుసలో తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ తనయుడు, సీఎం కెసిఆర్ మనవడు హిమాన్షు చేరిపోయాడు. కానీ.. నటుడిగా మాత్రం కాదు. సింగర్ గా. హిమాన్షుకి ముందు నుండే మ్యూజిక్ పై ఇంటరెస్ట్ ఉందట. అందుకే తాజాగా ‘గోల్డెన్ అవర్’ అనే ఇంగ్లీష్ సాంగ్ కి కవర్ సాంగ్ పాడి యూట్యూబ్ లో రిలీజ్ చేశాడు. మొదటి ప్రయత్నంగా రిలీజ్ చేసిన ఈ సాంగ్ ని.. తండ్రి, మంత్రి కేటీఆర్ కొనియాడుతూ.. “నా కొడుకు హిమాన్షుని చూస్తుంటే.. నాకెంతో గర్వంగా, ఆనందంగా ఉంది. తను పాడిన సాంగ్ నాకు బాగా నచ్చింది. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను’ అని ట్వీట్ లో హిమాన్షు పాడిన సాంగ్ ని షేర్ చేశారు.
ఇదిలా ఉండగా.. హిమాన్షు వాయిస్ లో గోల్డెన్ అవర్ సాంగ్ విన్న వారంతా ఆశ్చర్యానికి గురవుతూ.. హిమాన్షు టాలెంట్ ని మెచ్చుకుంటున్నారు. పైగా తాతగారు, తెలంగాణ సీఎం కెసిఆర్ పుట్టినరోజున రిలీజ్ చేయడం స్పెషల్ విషయం అని నెటిజన్స్ కామెంట్స్ లో హిమాన్షుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం హిమాన్షు పాడిన ఇంగ్లీష్ సాంగ్.. సోషల్ మీడియాలో వైరల్ గా మరింది. దీంతో కేటిఆర్ తన కుమారుడిని ప్రొఫెషనల్ సింగర్ ని చేస్తాడా? ఆ వైపు అడుగులు వేయించే ఆలోచన ఏమైనా ఉందా? అని పలువురు నెట్టింట అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరి మీరు కూడా హిమాన్షు పాడిన సాంగ్ విని ఎలా ఉందో కామెంట్స్ లో తెలియజేయండి.