TSPSC పేపర్ లీకేజీ వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేకున్నా గానీ తన పేరును వాడుతున్నారు అంటూ ప్రతిపక్షాలపై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. తనపై అసత్య ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్, బీజేపీ నేతలు అయిన రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లకు లీగల్ నోటీసులు పంపారు కేటీఆర్.
తెలంగాణలో తాజాగా సంచలనం రేపిన సంఘటన ఏదైనా ఉంది అంటే.. అది టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహరమే. ఈ పేపర్ లీకేజీ వ్యవహరంపై ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి ప్రతిపక్షాలు. ఈ క్రమంలోనే పేపర్ లీకేజీ వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేకున్నా గానీ తన పేరును వాడుతున్నారు అంటూ ప్రతిపక్షాలపై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. తనపై అసత్య ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్, బీజేపీ నేతలు అయిన రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లకు లీగల్ నోటీసులు పంపారు కేటీఆర్. రాజకీయ దురుద్దేశంతోనే తన పేరును వాడుతున్నారు అంటూ వారిపై రూ. 100 కోట్ల పరువు నష్టం దావా వేశారు కేటీఆర్.
తెలంగాణ పబ్లిక్ కమిషన్ పేపర్ లీకేజీ వ్యవహరంలో తనకు ఎలాంటి సంబంధం లేకున్నా గానీ.. కావాలనే తన పేరును పదే పదే వాడుతున్నారు అంటూ ప్రతిపక్షాలపై మండిపడ్డారు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్. ముఖ్యంగా కాంగ్రెస్ నేత ఎంపీ రేవంత్ రెడ్డి, బీజేపీ నేత బండి సంజయ్ లు కేటీఆర్ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. ఈ విమర్శలపై ఇద్దరు నాయకులకు లీగల్ నోటీసులు పంపారు కేటీఆర్.
ఈ క్రమంలోనే తన పరువుకు భంగం కలిగించాలన్న ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లు పదే పదే అబద్దాలను ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. వీరిపై ఇండియన్ పీనల్ కోడ్ 499, 500 నిబంధనల ప్రకారం పరువు నష్టం దావా నోటీసులు పంపించారు. వారం రోజుల్లోగా తనపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పకుంటే.. రూ. 100 కోట్ల పరువు నష్టం దావాను ఎదుర్కొవాల్సి వస్తుందని కేటీఆర్ లీగల్ నోటీసులో పేర్కొన్నాడు. మరి ఈ పరువు నష్టం దావాపై బండి సంజయ్, రేవంత్ రెడ్డిలు ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాలి.