కేటీఆర్.. రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టీవ్‌గా ఉంటారు. రాజకీయాల్లోనే కాక.. ప్రసంగాల్లో కూడా కేటీఆర్.. తండ్రి బాటలోనే నడుస్తారు. ఆయన మాదిరిగానే.. సెటైర్లు వేస్తూ.. జోక్స్ చేస్తూ.. సరదాగా మాట్లాడతారు. అదే రాజకీయాల్లోకి వస్తే.. పదునైన విమర్శలు చేస్తూ.. ప్రతిపక్షాల మీద విరుచుకుపడతారు. ఇక సోషల్ మీడియా వేదికగా సాయం కోరిన వారిని, ప్రతిభావంతులను ఆదుకోవడంలో ముందుంటారు. ఇక తాజాగా కరీంగనర్ కళోత్సవాల సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్.. మై విలేజ్ షో ఫేమ్ గంగవ్వతో కలిసి జోకులు వేశారు. తప్పకుండా మై విలేజ్ షోకి గెస్ట్‌గా వస్తాను అని తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.
ఆదివారం నాడు కరీంనగర్ కళోత్సవాలు ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చారు తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్. మూడు రోజుల పాటు సాగిన సాంస్కృతికోత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్.. తన ప్రసంగంతో అందరిని ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా కళాకారులను అభినందించిన కేటీఆర్.. బిగ్‌బాస్ ఫేమ్, ప్రముఖ యూట్యూబర్ గంగవ్వపై సరదా వ్యాఖ్యలు చేశారు. తనను మహేష్ బాబుతో పోల్చినందకు థాంక్స్ చెప్తూనే.. కళ్లు చెక్ చేపించుకో గంగవ్వా అంటూ తన మీద తానే సెటైర్లు వేసుకున్నారు కేటీఆర్.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘‘గంగవ్వని సోషల్ మీడియాలో చాలాసార్లు చూశా కానీ.. స్వయంగా కలిసింది లేదు. ఆమె మంచిది కాబట్టి నన్ను మహేష్ బాబుతో పోల్చింది. కానీ ఈ మాట మహేష్ బాబు వింటే ఫీల్ అవుతాడు. గంగవ్వా (గంగవ్వ) నీ కళ్లు చూపెట్టుకోవాలి జల్దీ.. ఇప్పుడే గంగవ్వకి మాట ఇచ్చాను.. మై విలేజ్ షోకి గెస్ట్‌గా వస్తానని.. ఆ షోకి తప్పకుండా వెళ్తా.. నాకు తెలిసిన నాలుగు విషయాలు చెప్తా. అలాగే గంగవ్వ దగ్గర 4 విషయాలు నేర్చుకుంటాను’’ అన్నారు కేటీఆర్. అయితే కేటీఆర్ తాను ప్రసంగిస్తున్నంతసేపు.. గంగవ్వని.. గంగమ్మ అని పిలిచాడు. పేరుతో పనేం ఉంది.. మా గంగవ్వ కేటీఆర్‌కి నోటెడ్ అయ్యింది. అంతేకాక మై విలేజ్ షోకి గెస్ట్‌గా వస్తానని మాట కూడా ఇచ్చాడు అంటూ మై విలేజ్ షో ఫ్యాన్స్, గంగవ్వ అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు.
ఇక మై విలేజ్ షోతో పాపులర్ అయిన గంగవ్వ.. బిగ్ బాస్ నాలుగో సీజన్ కంటెస్టెంట్‌గా వెళ్లి అల్లాడించింది. ఈ సీజన్ ప్రారంభంలో నాలుగు వారాలు గంగవ్వనే స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. ఆ తరువాత అనారోగ్య సమస్యల కారణంగా ఆమె కొన్ని రోజులు మాత్రమే బిగ్‌బాస్ హౌస్‌లో ఉంది. అయితే గంగవ్వ బిగ్‌బాస్‌లో వెళ్లేటప్పుడే.. సొంతిళ్లు కట్టుకోవడం తన కల అని చెప్పింది. దాంతో బిగ్‌బాస్ హోస్ట్ నాగార్జున ఆర్ధికసాయంతో కొత్త ఇల్లు నిర్మించుకుంది గంగవ్వ. ఆమె ఇంటి నిర్మాణానికి మొత్తం రూ.20 లక్షలకుపైగా ఖర్చు అయ్యింది. డీఎన్‌కే కన్ స్ట్రక్షన్స్ వాళ్లు ఈ భవనాన్ని విలాసవంతంగానే నిర్మించడం విశేషం. యూట్యూబ్ ద్వారా విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న గంగవ్వ గత కొంత కాలంగా వరుస సినిమాలతో బిజీ అయ్యింది.
Pleasure meeting the popular & Pakka local You Tube star Gangavva Garu 😊
Promised her that I’ll be a guest on her My Village Show asap https://t.co/0Lr5aDQEiI
— KTR (@KTRTRS) October 3, 2022