సమాజంలో పేదరికంతో నలిగిపోతున్న ప్రజలు ఎంతోమంది ఉన్నారు. వారందరికి స్వయంగా సాయం చేయడం కుదరకపోవచ్చు. కానీ వారి గురించి బయటి ప్రపంచానికి తెలియజేస్తే..
వారిని ఆదుకోవడానికి ముందుకు వచ్చేవారు ఉంటారు. అలాంటి మంచిపనే సుమన్ టీవీ చేస్తుంది. గతేడాది నవంబర్ లో సుమన్ టీవీ సబిత అనే ఇంటర్ విద్యార్థిని గురించి ఓ వీడియో చేసింది. అది వైరల్ కావడమే కాక దానిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించిన తీరు సంతోషాన్నిచ్చింది. ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోన్న సబితను ఆదుకోవాల్సిందిగా నల్లగొండ జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు కేటీఆర్. తాను కూడా వ్యక్తిగతంగా ఆ సోదరిని కలుస్తానని గతంలో సోషల్ మీడియా ద్వారా తెలిపారు. తాజాగా కేటీఆర్ తన మాటను నిలబెట్టుకున్నారు.
As promised, met this young & supremely confident girl Sabita. Impressed with her clarity of thoughts & expression👏
Handed over copies of 2BHK proceeding & an Auto rickshaw as she had asked. Also promised to support her education pursuits
Special thanks to @Collector_NLG 👍 pic.twitter.com/qKGUhlN5t3
— KTR (@KTRTRS) February 9, 2022
నిరుపేద కుటుంబంలో జన్మించి, తండ్రి బాధ్యతలను తన భుజాలపై వేసుకున్న సబితకి మంత్రి కేటీఆర్ ఇచ్చిన మాట ప్రకారం ప్రగతి భవన్ కు పిలిపించి సత్కరించారు. ఆమె కోరినట్లు డబుల్ బెడ్రూం ఇంటి పత్రాలను, ఆటోను అందజేశారు. సబిత ఆలోచనా విధానం, మాటతీరు తనను ఎంతో ఆకర్షించిందని కేటీఆర్ ట్వీట్ చేశారు. సబిత ఉన్నత చదువులకు తప్పకుండా సహాయం చేస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, నల్లగొండ జిల్లా కలెక్టర్ కు సబిత ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.
Request @Collector_NLG Prashant Patil Garu to meet and assist this dynamic young lady
I will also meet her personally to see how best we can help her asap @KTRoffice please coordinate https://t.co/MVRMw2Vihp
— KTR (@KTRTRS) February 6, 2022
నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం వంగమర్తికి చెందిన నామరమల్ల నర్సయ్య, రమణ దంపతుల ఒక్కగానొక్క కూతురు సబిత. వారిది నిరుపేద కుటుంబం కావడంతో పోషణ కోసం గ్రామంలోని ఓ హోటల్లో చేరి తన ఇంటిల్లిపాదితో పనికి కుదిరాడు నర్సయ్య. అనారోగ్యానికి గురికావడంతో 2015లో నర్సయ్య మృతి చెందాడు. దీంతో తల్లి రమణ తన కూతురును సాకుతూ అదే హోటల్లో పని చేస్తూ కాలం వెల్లదీస్తోంది. తల్లికి అనారోగ్యం.. సబిత తనను తాను పోషించుకోవడమే కాక.. తల్లికి అండగా నిలవాల్సి వచ్చింది. ఈ క్రమంలో సబిత విషయం తెలుసుకున్న మంత్రి కేటీఆర్ వారి కుటుంబాన్ని ఆదుకున్నారు. మరి.. మంత్రి కేటీఆర్ సబితను ఆదుకున్న తీరు పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.