KTR: రా రైస్, బాయిల్డ్ రైస్ నిబంధనలు లేకుండా తెలంగాణలో పండే ధాన్యాన్ని కొనాలని తాము కేంద్రాన్ని కోరామని కేటీఆర్ తెలిపారు. దీనిపై మాట్లాడటానికి మంత్రుల బృందం ఢిల్లీ వెళితే అపాయింట్‌మెంట్ ఇవ్వకుండా సతాయించారన్నారు. ఎందుకు వచ్చారంటూ అవమానించారని కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల్ని అమమానించినందుకు నిరసనగా ఆందోళనలు చేపడతామని ప్రకటించారు. శనివారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ ఎల్లుండి మండల కేంద్రాల్లో నిరసన దీక్షలు చేపడతాం.
ఈ నెల 6న జాతీయ రహదార్లపై రాస్తారోకో నిర్వహిస్తాం. విజయవాడ, ముంబై, బెంగళూరు, నాగ్‌పూర్ హైవేలపై రాస్తారోకోలు నిర్వహిస్తాం. 7వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో ఎమ్మెల్యేలు, మంత్రుల ఆధ్వర్యంలో నిరసన చేపడతాం. 8వ తేదీన ప్రతీ రైతు ఇంటిపై నల్ల జెండాలు ఎగురవేయాలి. 11వ తేదీన ఢిల్లీలో టీఆర్‌ఎస్ ముఖ్య నేతలంతా నిరసనల్లో పాల్గొంటారు’’ అని తెలిపారు. కేంద్రంపై టీఆర్‌ఎస్ యాక్షన్ ప్లాన్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : ప్రణయ్ హత్యకేసు నిందితుడికి గుండెపోటు.. ఆస్పత్రికి తరలించిన పోలీసులు!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.