ఈ మద్య సెలబ్రెటీలు వెరైటీగా ఛాలెంజ్ లు విసురుకుంటున్నారు. సినీ, రాజకీయ, క్రీడా రంగానికి చెందిన వారు పర్యావరణ ఇతర అంశాలకు సంబంధించిన ఛాలెంజ్ లు విసురుకోవడం చూస్తూనే ఉన్నాం. తాజాగా జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా ముగ్గురికి ఛాలెంజ్ విసిరారు. పవన్ కళ్యాన్, సచిన్ టెండూల్కర్, ఆనంద్ మహేంద్రకు చేనేత వస్త్రాలు ధరించి ఫోటోలు పోస్ట్ చేయాలని ఛాలెంజ్ చేశారు.
ఇక మంత్రి కేటీఆర్ విసిరిన సవాల్ ని జనసేన అధినేత పవన్ కళ్యాన్ స్వీకరించారు. అంతేకాదు ‘రామ్ భాయ్.. మీ ఛాలెంజ్‌ను స్వీకరించా’ అంటూ చేనేత వస్త్రాలు ధరించిన ఫొటోలను ట్విటర్‌లో షేర్ చేశారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తనకు సవాల్ విసిరినందుకు ధన్యవాదాలు అంటూ పవన్ కళ్యాన్ తన ట్విట్టర్ లో తెలిపారు.
ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలు ధరించాలని సూచించారు. టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపీ ఎంపీ లక్ష్మణ్, ఏపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డికి చేనేత వస్త్రాలు ధరించి ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయాల్సిందిగా పవన్ కళ్యాన్ ‘చేనేత’ సవాల్ విసిరారు.
Thanks @PawanKalyan Anna https://t.co/2bjZ0hCt3Y
— KTR (@KTRTRS) August 7, 2022