పెళ్లి.. ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మధురమైన జ్ఞాపకం. అందుకే దాన్ని అందంగా జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకంగా మలుచుకోవడం కోసం ప్రతి ఒక్కరు తమకు తోచిన విధంగా ప్రయత్నిస్తారు. అయితే కొందరి ఐడియాలు సింపుల్ అండ్ వెరైటీగా ఉండి సక్సెస్ అవ్వడమే కాక.. వైరలవుతాయి కూడా. తాజాగా ఈ కోవకు చెందిన పెళ్లి పత్రిక ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇక సదరు కలెక్టర్ క్రియేటివిటీకి నెటిజనులు ఫిదా అయ్యారు.
సాధారణంగా పెద్దలు కుదర్చిన వివాహం అంటే.. పెళ్లి చూపులకెళ్లడం.. అమ్మాయి నచ్చితే ఓకే చెప్పడం.. ఆ తర్వాత పెళ్లి. ఇదే ఉంటుంది. కానీ లవ్ మారేజ్ లో మాత్రం.. ప్రతి సంఘటన ఓ మధుర జ్ఞాపకమే.. అమ్మాయి/అబ్బాయిపై మనసు పారేసుకున్న నాటి నుంచి.. ఆ ప్రేమ పెళ్లి పీటలు ఎక్కే వరకు ఎన్నో జ్ఞాపకాలు. ఇక వాటన్నింటిని పెళ్లి పత్రికలో బంధుమిత్రులందరికి తెలియజేస్తే.. సూపర్ గా ఉంటుంది కదా. ఇదే ఆలోచన వచ్చింది ఖమ్మం జిల్లాలో ట్రైనీ కలెక్టర్ గా పని చేస్తోన్న రాహుల్ కి. ఆలోచన వచ్చిందే తడవుగా.. దాన్ని ఆచరణలో పెట్టారు. ఇంత క్రియేటివిటీగా ఆలోచించారు కనుకే ప్రస్తుతం రాహుల్ పెళ్లి పత్రిక తెగ వైరలవుతోంది. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి : ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిలు.! చివరిలో షాకింగ్ ట్విస్ట్!
ఖమ్మం జిల్లా ట్రైనీ కలెక్టర్‌గా పని పనిచేస్తున్న రాహుల్‌ది మహబూబ్‌నగర్ జిల్లా. ఫిబ్రవరి 10వ తేదీన మనీషా అనే యువతిని పెళ్లి చేసుకోబోతున్నారు. అయితే వీరిది ప్రేమ వివాహం. ఈ క్రమంలోనే వారి మధ్య తొలి చూపు నుంచి పెళ్లి పీటలు ఎక్కే వరకు సాగిన వారి ప్రేమ ప్రయణాన్ని కవిత రూపంలో.. స్వీట్ అండ్ షార్ట్ గా సినిమా స్టైల్ లో యానిమేషన్ రూపంలో వీడియో రూపొందించారు రాహుల్.
ఇది కూడా చదవండి : కరోనాతో స్నేహితుడి మృతి.. ఆ వ్యక్తి చేసిన పనికి అందరూ ఫిదా
దీనిలో రాహుల్ కు మనీషా మీద తొలి చూపులోనే కలిగిన ఆకర్షణ.. ఆ తర్వాత ఆమె గురించి తెలుసుకోవడం కోసం బస్ లో ప్రయాణం చేయడం.. బస్ జర్నీ కాస్త.. బైక్ ఎక్కడం.. ఇద్దరి మధ్య చిరు మొహమాటం.. చివరకు దేవుడి సాక్షిగా వారి మధ్య ఆలయంలో ప్రేమను వెల్లడించడం, అది ముందుకు సాగి.. పెద్దల వరకు చేరడం.. వారి అంగీకారం.. ఆ వెంటనే నిశ్చితార్థం.. చివరకు పెళ్లి పీటలు ఎక్కడం ఇలా వారి ప్రేమ ప్రయాణంలోని అందమైన జ్ఞాపకాలను వీడియోలో చూపించారు రాహుల్. కలెక్టర్ క్రియేటివిటీకి ఆయన బంధుమిత్రులు ఫిదా అవ్వడమే కాక.. ఈ వీడియోను కాస్త సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది. ఈ వీడియోను మీరు చూసి.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.