సోషల్ మీడియా వినియోగం పెరిగాక.. సెలబ్రిటీల మీద విమర్శలు చేసే వారి సంఖ్య పెరుగుతుంది. కొందరు ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో ఇలా చేస్తే.. మరి కొందరు కావాలనే చేస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా ఓ సంఘటన వెలుగులోకి వచ్చింది. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోడలు నారా బ్రాహ్మణిపై.. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు చేశాడు ఓ వ్యక్తి. ఇది గమనించిన టీడీపీ నేతలు.. సదరు వ్యక్తిని చితకబాదారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఆ వివరాలు..
కృష్ణా జిల్లాకు చెందిన కోదాటి నరసింహం అనే వ్యక్తి.. ఖమ్మం జిల్లా టేకులపల్లిలో ఆర్‌ఎంపీగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో నరసింహం తన ఫేస్‌బుక్‌లో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కోడలు నారా బ్రాహ్మణిపై అసభ్య పదజాలంతో పోస్టులు పెట్టడంతోపాటు వ్యక్తిగతంగా కించపరిచే పదాలు పోస్ట్ చేశాడు. వీటిని కాస్త.. టీడీపీ నాయకులు గుర్తించారు. వెంటనే కోదాటి నరసింహం దగ్గరకు వెళ్లి.. పోస్ట్ గురించి ప్రశ్నించారు. అందుకు నరసింహం దురుసుగా సమాధానం ఇవ్వడంతో.. ఆగ్రహానికి గురైన నాయకులు అతడికి దేహశుద్ధి చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది.