సాధారణంగా ప్రసవ సమయంలో మహిళ భర్తతో సహ ఎవరిని అక్కడ ఉండనివ్వరు. ఇది అందరికి తెలిసిన విషయమే. కానీ.. ఆస్పత్రి వైద్యులు తొలిసారి ఓ గర్భిణీకి ఆమె భర్త సమక్షంలో “బర్త్ కంపానియన్” విధానంలో కాన్పు చేశారు. భర్త కళ్లముందే భార్యకు వైద్యులు కాన్పు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా బర్త్ కంపానియన్ విధానంలో జరిగిన డెలివరీ ఇదే. ఖమ్మం జిల్లాలో ఈ అరుదైన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
ఖమ్మ జిల్లాకు చెందిన శ్రీలత(23)అనే గర్భిణీ పురిటి నొప్పులతో జిల్లాలోని పెద్దాస్పత్రిలో చేరింది. అక్కడి మాతాశిశు సంరక్షణ కేంద్రంలో హెచ్ వోడీ ఉషశ్రీ ఆధ్వర్యంలో సిబ్బంది.. “బర్త్ కంపానియన్” అనే విధానంలో శ్రీలతకు సుఖ ప్రసవం చేశారు. ప్రసవ సమయంలో ఆమె భర్తను ఆపరేషన్ రూమ్ లోకి పిలిపించారు. భర్త సమక్షంలో శ్రీలతకు డెలివరీ చేశారు. ఆమె పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది.
“సాధారణంగా ప్రసవ సమయంలో గర్భిణీలో భయం, ఒత్తిడి, ఆందోళన ఉంటుంది. ఆ కారణంగా నొప్పులు రావడానికి అవసరమైన ఆక్సిటోసిన్ హార్మోన్ విడుదల కాదు. అందుకే కాన్పు సమయంలో కుటుంబ సభ్యుల్లో ఎవరైన ఆమె చెయ్యి పట్టుకోవడం, తల నిమరడం వంటివి చేయడం ద్వారా ఆక్సిటోసిన్ హార్మోన్ త్వరగా విడుదలై నొప్పులు ఎక్కువగా వచ్చి ప్రసవం సుఖంగా జరుతుంది” అని వైద్యులు తెలిపారు.
అంతేకా ఆ మహిళ కాన్పులో పుట్టిన బిడ్డ బొడ్డుతాడును తండ్రి చేత కత్తిరించారు. దీని ద్వారా సదరు మహిళ భర్త గొప్ప అనుభూతిని పొందడమే కాకుండా భార్య ప్రసవవేదనను దగ్గరుండి చూస్తే, ఆమెపై మరింత గౌరవం పెరుగుతుందని వైద్య సిబ్బంది తెలిపారు. కాన్పుగదిలోకి గర్భిణీ మహిళకు ఇష్టమైన వారిలో ఒకరిని అనుమతిస్తామని అంటున్నారు. ఇలాంటి విధానం విదేశాల్లో ఎప్పటి నుంచో అమలులో ఉండగా, మనదేశంలో కొన్ని చోట్ల మాత్రమే ఆచరిస్తున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.