చీమలపాడు సిలిండర్ పేలుడు ఘటన విషాదం ఇంకా వీడలేదు. ప్రమాదంలో మరణించిన ముగ్గురి అంత్యక్రియలు గురువారం పూర్తయ్యాయి. నిన్నటి వరకు తమతో గడిపిన వారు ఇకలేరనే విషయాన్ని కుటుంబ సభ్యుల రోదనలు అందరినీ కంటతడి పెట్టించాయి. ఇలానే హృదయాలను ద్రవింప చేసే దృశ్యాలు ఈ ఘటనలో కనిపించాయి.
రెండు రోజుల క్రితం ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడు లో జరిగిన అగ్నిప్రమాదం గురించి అందరికి తెలిసిందే. అక్కడ సంబరాల్లో భాగంగా టపాసులు కాలుస్తుండగా ఓ బాణసంచా పక్కనే ఉన్న గుడిసె పై పడింది. దీంతో అక్కడ మంటలు వ్యాపించి..చివరకు గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ముగ్గరు మృతి చెందారు. ఈ ఘటన విషాదం ఇంకా వీడలేదు. ఈ ప్రమాదంలో మరణించిన ముగ్గురి అంత్యక్రియలు గురువారం ముగిశాయి. గ్రామస్థుల, కుటుంబ సభ్యుల రోదన మధ్య మృతుల అంతిమయాత్ర సాగింది. ఈ అంత్యక్రియల సమయంలో హృదయం ద్రవింప చేసే దృశ్యాలు కనిపించాయి. ఓ కుమార్తె తన తండ్రికి తలకొరివి పెట్టిన దృశ్యం అందరిని కంటతడి పెట్టేలా చేసింది.
బుధవారం ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడు బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా కార్యకర్తలు టపాసులు కాల్చుతూ సందండి చేశారు. ఈ క్రమంలో ఘోర ప్రమాదం చోటుచేసుకున్న విషయం అందరికి తెలిసిందే. బాణసంచాల్లో ఒకటి పక్కనే ఉన్న గుడిసెపై పడి మంటలు అంటుకున్నాయి. అందరు చూస్తుండగానే అందులోని సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. 10 మందికి గాయాలయ్యాయి. వారిలో చాలా మందికి చేతులు, కాళ్లు తెగి పడ్డాయి. ఈ ఘటనలోని బాధితులు, మృతులు అజ్మీరా, స్టేషన్ చీమలపాడు, గేటురేలకాయలపల్లిలకు చెందిన వారు. ఇక మృతులకు బుధవారం రాత్రే పోస్టు మార్టం పూర్తి చేసి వారి స్వగ్రామాలకు తరలించారు.
గురువారం ఉదయం మృతులు అజ్మీరా మంగు చీమలపాడులో, బానోతు రమేశ్ కు చీమలపాడులో, ధరంసోత్ లక్ష్మాల కు గేటురేలకాయలపల్లిలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ అంత్యక్రియలకు బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు, వైరా ఎమ్మెల్యే రాములునాయక్, మరికొందరు నేతలు మూడు గ్రామలకు వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించారు. మృతుల్లో ఒకరైన బానోతు లక్ష్మాకు ఆయన కుమార్తె తలకొరివి పెట్టిన తీరు అందరి హృదయాలను కలచి వేసింది. ఆయనకు భార్య సరోజ, నలుగురు కుమార్తెలు ఉన్నారు. చిన్నతనం నుంచి ఎంతో అల్లారు ముద్దుగా పెంచిన తండ్రి విగతజీవిగా ఉండటం చూసి తట్టుకోలేక వారు చేసిన రోదనలు అందరినీ కన్నీళ్లు పెట్టించాయి లక్ష్మాకు ఆయన పెద్ద కుమార్తె సరస్వతి తలకొరివి పెట్టారు. ఇలా పేలుడు ఘటన కొన్ని కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపాయి.