ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో భాగంగా ఆరోపమలు ఎదుర్కొన్న ఎమ్మెల్సీ కవితని ఈడీ అధికారులు.. శనివారం దాదాపు 9 గంటలకు పైగా విచారించారు. ఈ నెల 16న మరోసారి విచారణ రావాలని ఆదేశించారు. అయితే నిన్న రాత్రి ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు చేరుకున్న కవిత.. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఈమెతో పాటు హరీష్ రావు కూడా ఈ మీటింగ్ లో పాల్గొన్నారు. దీంతో ఈ భేటీ కాస్త ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ భేటీలో తాజా పరిణామాలపై చర్చించుకున్నట్లు తెలుస్తోంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితని శనివారం ఉదయం 11 నుంచి సాయంత్రం 8 గంటల వరకు ఈడీ అధికారులు విచారించారు. అయితే సాయంత్రం 6 దాటిపోయినప్పటికీ కవిత బయటకు రాకపోవడంతో ఆమెని అరెస్ట్ చేయడం దాదాపు కన్ఫర్మ్ అనుకున్నారు. కానీ అలాంటిదేం లేకుండా మరోసారి విచారణకు రావాలని కవితని ఈడీ ఆదేశించింది. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన కవిత.. నేరుగా ప్రగతి భవన్ కు వెళ్లిపోయారు. ఇప్పుడు కొన్నిగంటల వ్యవధిలోనే మరోసారి అక్కడికి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.
కవితను నిన్నటి విచారణలో ఏమేం ప్రశ్నలు అడిగారు. వాటికి కవిత ఏం సమాధానాలు చెప్పారు? ఇలా ఈడీ విచారణ, తాజాగా జరుగుతున్న పరిణామాలపై కేసీఆర్, తన కుమార్తె కవితతో భేటీ అయినట్లు తెలుస్తోంది. అలానే ఈడీ తాజాగా నోటీసులపై కూడా కేసీఆర్ తన సలహాలు, సూచనలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా సరే ముఖ్యమంత్రి కేసీఆర్ తో కవిత ఆకస్మిక భేటీ మాత్రం స్వరత్రా చర్చనీయాంశంగా మారింది. మరి కవితతోపాటు హరీష్ రావుతో కేసీఆర్ భేటీ కావడంపై మీరేం అంటారు. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.