అభిషేక్ అగర్వాల్.. ఇప్పుడు టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాతల్లో ఒకరిగా ఉన్నారు. ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ-2 వంటి విజయవంతమైన చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. తెలుగు చిత్రపరిశ్రమలో అతి తక్కువ కాలంలో మెస్ట్ సక్సెస్ ఫుల్ ప్రోడ్యూసర్ గా అభిషేక్ అగర్వాల్ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల ఆయన నిర్మించిన ది కాశ్మీర్ ఫైల్స్ , కార్తికేయ-2 సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాలతో మంచి లాభాలు అందుకున్న అభిషేక్ అగర్వాల్ మరోసారి మంచి మనస్సు చాటుకున్నాడు. కరోనా సమయంలో చాలా మంది పేదలకు సాయం చేసి.. వారికి ఎంతో చేయుత ఇచ్చారు. తాజాగా మరో అడుగు ముందుకు వేశారు. తెలంగాణలోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నారు.
వ్యాపారవేత్త అయిన అభిషేక్ అగర్వాల్ సినిమాలపై ఉన్న ఇష్టంతో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ అనే ఓ నిర్మాణ సంస్థను స్థాపించారు. అనంతరం మహేష్ బాబు నటించిన బ్రహోత్సవం సినిమాకు డిస్ర్టిబ్యూటర్ గా వ్యవహరించారు. కిర్రాక్ పార్టీ, గూఢచారీ, సీత సినిమాలకు సహ నిర్మాతగా వ్యవహరించారు. ఆ తర్వాత ఏ1 ఎక్స్ ప్రెస్ తో పూర్తి స్థాయి నిర్మాతగా మారారు. అనంతరం ఇటీవల రాజ రాజ చోర, ది కాశ్మీర్ ఫైల్స్, కార్తీకేయ-2 చిత్రాలను నిర్మించి విజయాలను అందుకున్నారు. ప్రస్తుతం రవితేజతో టైగర్ నాగేశ్వరావు సినిమాను నిర్మిస్తున్నారు. సినిమాల పై ఆసక్తితో పాటు సమాజ సేవ చేయాలనే తపన కలిగిన వ్యక్తి అభిషేక్ అగర్వాల్. కరోనా టైమ్ లో పేదలకు ఆహారం, ఇతర నిత్యవసర సరకులు అందించారు. తాజాగా రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నారు.
ఈ గ్రామం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి జన్మస్థలం కావడం విశేషం. అభిషేక్ కి, మంత్రి కిషన్ రెడ్డి మధ్య మంచి అనుబంధం ఉంది. గతంలో వివిధ కార్యక్రామాల్లో ,వేడుకల్లో చాలాసార్లు వీరు కలిసి కనిపించిన సంగతి తెలిసిందే. మరోకవైపు అభిషేక్ అగర్వాల్ కుటుంబం చంద్రకళ ఫౌండేషన్ స్థాపించి ప్రజలకు సేవ చేస్తున్నారు. ఈక్రమంలో తన తండ్రి తేజ్ నారాయణ్ అగర్వాల్ 60 వ పుట్టిన రోజు, అమ్మమ్మ శ్రీమతి చంద్రకళ 90వ జయంతి సందర్భంగా తిమ్మాపూర గ్రామాన్ని అభిషేక్ దత్తత తీసుకుంటున్నారు. చంద్రకళ ఫౌండేషన్ 3వ సార్ధక్ దివాస్ ను అక్టోబర్ 30న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో నిర్వహించనున్నారు. ఆ కార్యక్రమంలోనే తిమ్మాపూర్ ను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించనున్నారు.