హాస్టల్స్ లో భోజనం రుచిగా ఉండాలని ఎవరూ కోరుకోరు. అన్నింటికి సిద్ధపడే హాస్టల్స్ లో చేరతారు. అయితే అసలు రుచిగా లేకపోయినా పర్లేదు కానీ.. ఇలా సుచి కూడా లేకుండా ఎలా చేస్తారు అంటూ హాస్టలర్స్ ప్రశ్నిస్తున్నారు.
ఉన్నత చదువులు, ఉద్యోగం, ఉపాధి ఇలా అవసరం ఏదైనా.. చాలా మంది సొంతూరు వదిలి వేరే సిటీలకు, పట్టణాలకు వెళ్తుంటారు. అలా వెళ్లినప్పుడు అందరూ రూమ్స్ తీసుకుని ఉండలేరు. అలాంటప్పుడు హాస్టల్ నివసిస్తారు. నిజానికి ప్రైవేట్ హాస్టల్స్ లో చాలా చోట్ల భోజనం బాగోదు. చిన్న చిన్న గదులు ఉంటాయి. అయినా ఎలాగోలా మేనేజ్ చేసుకుంటారు. తీసుకునే డబ్బులకు సరైన తిండి పెట్టకపోయినా పర్లేదు.. కానీ, మరీ ఇంత దారుణంగా వ్యవహరిచడం మాత్రం ఘోరమనే చెప్పాలి. వంట రుచిగా లేకపోయినా.. సుచిగా ఉండాలని కోరుకుంటారు. ఈ వంట మనిషి చేసిన పని చూస్తే ఛీ అనకుండా ఉండలేరు.
సాధారణంగా ప్రైవేట్ హాస్టల్స్ లో వంట రుచిగా ఉండాలి అంటే అత్యాసే అవుతుది అంటారు. కానీ, సుచిగా లేకపోతే మాత్రం లేనిపోని రోగాల బారిన పడాల్సి ఉంటుంది. కరీంనగర్ జిల్లా మంకమ్మతోటలోని ఓ ప్రైవేటు హాస్టల్ లో వంట మనిషి నిర్వాకం వెలుగు చూసింది. వంటగదిలో పెట్టిన సీసీ కెమెరా పరిశీలిస్తే ఆమె చేసిన ఘనకార్యం అందరికీ తెలిసింది. ఆ మహిళ వంటగదిలో హడావుడిగా పని చేస్తోంది. అయితే కాసేపటికి ఆమె మూత్ర విసర్జన చేసేందుకు సిద్ధమైంది. అక్కడే ఉన్న పాత్రను వెతికింది. ఒక ప్లాస్టిక్ గిన్నె దొరకగానే తలుపు గడి పెట్టేసి మూత్రవిసర్జన చేసింది. ఆ తర్వాత సింకులో పారబోసి ఆ పాత్రలో నీళ్లు పోసింది. ఇదంతా సీసీటీవీలో రికార్డు అయింది.
ఈ దృశ్యాలు చూసిన విద్యార్థులు అంతా అక్కడ అన్నం తినాలంటే జంకుతున్నారు. ముందు ఆ ఘటన గుర్తుతెచ్చుకుని గగ్గోలు పెడుతున్నారు. ఇంతకాలం ఇలాంటి పాత్రల్లో మాకు వంట చేశారా? వడ్డించారా? అంటూ వికారం తెచ్చుకుంటున్నారు. అసలు అంత గలీజ్ పని ఎలా చేస్తారు? సొంత పిల్లలకు అయితే అలాంటి పాత్రల్లో వడ్డిస్తారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ వీడియో ఫుడ్ సేఫ్టీ అధికారులకు పంపి ఫిర్యాదు చేశారు. అయితే ఇప్పటివరకు హాస్టల్ యాజమాన్యంపై చర్యుల తీసుకోలేదంటూ హాస్టల్ లో ఉండే వాళ్లు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇంత దారుణానికి ఒడికట్టిన మహిళపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.