పోలీసులు అనగానే మన సమాజంలో.. కరుడుకట్టిన కర్కోటకులు అనే అభిప్రాయం బలంగా పాతుకుపోయింది. వారికి ఏమాత్రం జాలి, దయ ఉండవనే అభిప్రాయం ఏర్పడింది. ప్రస్తుతానికి ఈ పరిస్థితుల్లో కొంత మార్పు వచ్చింది. కానీ ఇప్పటికి కూడా అక్కడక్కడ కరుడు కట్టిన ఖాకీలు తారసపడుతూనే ఉంటారు. కానీ ఇప్పుడు మీరు చదవబోయే వార్త అందుకు పూర్తిగా విరుద్ధం. ఇక్కడ సదరు లేడీ సీఐ తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన బిడ్డలను ఆక్కున చేర్చుకుంది. వారిలో ఓ యువతిని దత్తత తీసుకుని.. సొంత పిల్లలతో సమానంగా చదివిస్తుంది. ఆమె మంచి మనసుకు సెల్యూట్ చేస్తున్నారు జనాలు. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి: Hindi Language: హిందీ నేషనల్ లాంగ్వేజ్ ఎలా అవుతుంది? కోర్టులు ఏమి చెప్తున్నాయి?
కరీనంగర్ జిల్లా, హుజురాబాద్ సీఐగా విధులు నిర్వహిస్తున్నారు మాధవి. మాధవి గతంలో రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ సీఐగా పని చేశారు. ఆమె విధులు నిర్వహిస్తున్న సమయంలో కోనరావుపేట మండలం నిమ్మపల్లి గ్రామానికి చెందిన భార్యభర్తలిద్దరూ అనారోగ్యంతో మరణించారు. తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోవడంతో వారి సంతానం అనాథలయ్యారనే వార్తను న్యూస్‌లో చూసి చలించిపోయారు మాధవి. అప్పటి డీఎస్పీ దామెర నర్సయ్యతో కలిసి వెళ్లి ఆ ఫ్యామిలీని పరామర్శించారు మాధవి. తల్లి, తండ్రి చనిపోవడంతో అనాథలైన చిన్నారులను చూసి బాధపడ్డారు. దాతల సాయంతో రూ. 2.50 లక్షల ఆర్థిక సాయాన్ని.. చిన్నారుల పేరుతో ఫిక్సిడ్ డిపాజిట్ చేయించారు. అంతటితో తన బాధ్యత ముగిసిందని భావించకుండా అనాథగా మారిన సంతానంలో గుమ్మడి భవాని అనే బాలికను సీఐ మాధవి దత్తత తీసుకుని పదోతరగతి చదివించారు. సిరిసిల్ల కస్తూరీబా పాఠశాలలో భవానిని టెన్త్ చదివించగా.. 9.7 గ్రేడ్ ను సాధించి రాజన్నసిరిసిల్ల జిల్లా ఎస్పీ, కలెక్టర్ల ప్రశంసలు అందుకుంది.
ఇది కూడా చదవండి: Telugu Indian Idol: లైవ్ లోనే గొడవపడ్డ తమన్- నిత్యామీనన్! వీడియో వైరల్!
గుమ్మడి భవానికి చదువుపై ఉన్న శ్రద్ధను గుర్తించిన సీఐ మాధవి తన కొడుకులు చదువుతున్న హైదరాబాద్ బాచుపల్లిలోని కార్పోరేట్ కాలేజీలోనే తనని చేర్పించారు. మూడేళ్ల క్రితం దత్తత తీసుకున్న బాలికను తన పిల్లలతో సమానంగా పోషిస్తూ చదివిస్తుంది మాధవి. కన్నవాళ్లే పిల్లల్ని పట్టించుకోని ప్రస్తుత సమాజంలో దత్త పుత్రికను సీఐ మాధవి సొంత బిడ్డలా చూసుకుంటున్నారు. ప్రతి నెలలో రెండుసార్లు భవానిని చూసేందుకు హైదరాబాద్ వెళ్లి వస్తున్నారు. సెలవు రోజుల్లో భవానిని కరీంనగర్‌లోని తన ఇంటికి తీసుకువచ్చి కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. తల్లి,తండ్రి చనిపోయి అనాథగా మారిన గుమ్మడి భవానికి అంతా తానై.. చివరకు అమ్మగా మారారు సీఐ మాధవి.
పేరు నిలబెడుతున్న దత్త పుత్రిక..
లేడీ పోలీస్ ఆఫీసర్ అక్కున చేర్చుకున్న భవానీ చదవులో అద్భుతమైన ప్రతిభ కనబరుస్తూ.. అందరి ప్రశంసలు అందుకుంటుంది. ఇంటర్‌లో 969 మార్కులు సాధించి ప్రతిభా పురస్కారం కూడా పొందింది. తన దత్త పుత్రిక సాధిస్తున్న విజయాలకు సంతోషంతో అందరికి స్వీట్స్ పంచి పెట్టి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. అనాథ బిడ్డను అక్కున చేర్చుకోవడమే కాకుండా ఓ ప్రయోజకురాలిగా తీర్చిదిద్దుతున్న లేడీ పోలీస్ ఆఫీసర్ మాధవిని సోషల్ మీడియా వేదికగా అందరూ అభినందిస్తున్నారు. అందరూ ఇలాగే ఆలోచిస్తే బాగుంటుందని కోరుతున్నారు. మాధవి చేస్తున్న మంచిపనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Chevireddy Bhaskar Reddy: MLA చెవిరెడ్డి సభకు రాకుంటే సంతకాలు పెట్టను.. మహిళా అధికారి ఆడియో లీక్!