ఊరికి మంచి చేయాలని అహర్నిశం తాపత్రయపడే ఓ మహిళ సర్పంచ్ అర్ధాంతరంగా తనువు చాలించింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతోన్న కామారెడ్డి జిల్లా, బీర్కూరు మండలం బరంగ్ ఎడ్గి గ్రామ సర్పంచ్ పోస్టు లక్ష్మి అనారోగ్యంతో కన్నుమూసింది.
విషాదం చోటుచేసుకుంది. ఊరికి మంచి చేయాలని అహర్నిశం తాపత్రయపడే ఓ మహిళ సర్పంచ్ అర్ధాంతరంగా తనువు చాలించింది. కామారెడ్డి జిల్లా, బీర్కూరు మండలం బరంగ్ ఎడ్గి గ్రామ సర్పంచ్ పోస్టు లక్ష్మి అనారోగ్యంతో కన్నుమూసింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతోన్న ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి తుది శ్వాస విడిచింది. దీంతో ఎడ్గి గ్రమంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
కామారెడ్డి జిల్లా, బీర్కూరు మండలం బరంగ్ ఎడ్గి గ్రామ సర్పంచ్ పోస్టు లక్ష్మి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ క్రమంలో కుటుంసభ్యులు.. ఆమెను హైదరాబాద్ లోని ఓ ప్రముఖ హాస్పిటల్ లో అడ్మిట్ చేసి చికిత్స అందిస్తున్నారు. అయినప్పటికీ ఆమె ఆరోగ్యం కుదుటపడలేదు. ఈ క్రమంలో సోమవారం రాత్రి చికిత్స పొందుతూనే ఆమె మరణించారు. గ్రామానికి మంచి చేయాలనే నిత్యం తాపత్రయ పడే ఒక నాయకురాలు చనిపోవడం గ్రామస్తులను కంటతడి పెట్టించింది. గ్రామస్తులందరూ ఆమెకు అశ్రునివాళి ఘటించారు.