తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ 21వ ఆవిర్భావ వేడుకలు రాష్ట్రంలో అట్టహాసంగా కొనసాగుతున్నాయి. HICC వేదికగా ప్లీనరీ జరుగుతోంది. ప్లీనరీకి 3 వేల మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు. పార్టీ ఆవిర్భావం సందర్భంగా, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు.. నగరంలో భారీ స్థాయిలో ఫ్లెక్సీలు, జెండాలను ఏర్పాటు చేశారు. ఎక్కడ చూసినా గులాబీ జెండాలు దర్శనమిస్తున్నాయి. దీనిపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
పార్టీ ప్లీనరీ కోసం సిటీ మొత్తం ఫ్లెక్సీలు కట్టడంపై పిటిషన్ లో ప్రశ్నించారు. తెలంగాణ ప్రిన్సిపల్ సెక్రటరీ, జీహెచ్ఎంసీ కమిషనర్ లను ప్రతివాదులుగా చేర్చారాయన. ఫ్లెక్సీలు పెట్టొద్దని ప్రభుత్వంలో గతంలో చెప్పిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. రూల్స్ కి విరుద్ధంగా ఉన్న ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. రోడ్డు మధ్యలో ఫ్లెక్సీలు ఎలా పెడతారని పాల్ ప్రశ్నించారు. దీనిపై జీహెచ్ఎంసీ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఎలాంటి ఫ్లెక్సీలు పెట్టొద్దని గతంలో ప్రభుత్వం చెప్పిందని.. ఇప్పుడు ఎందుకు రూల్స్ ని బ్రేక్ చేశారని కేఏ పాల్ ప్రశ్నించారు. క్లాసిఫైడ్స్ తో ప్రచారం చేస్కోవడం తప్పు కాదని, కానీ రోడ్డు మధ్యలో ఫ్లెక్సీలు పెట్టడం తప్పని కేఏ పాల్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: జాతిపిత గాంధీజీని ద్వేషించే దేశమా.. భారతదేశం?: సీఎం KCR