భారతీయ రాష్ట్ర సమితి(BRS) పార్టీ సంచలన నిర్ణయం తీసుకొంది. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఖమ్మంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఈ ఇద్దరు నేతలు పార్టీపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే వీరి మాటలను సిరీయస్ గా తీసుకున్న గులాబీ బాస్ సీఎం కేసీఆర్ పార్టీ నుంచి వారిని సస్పెండ్ చేశారు. అయితే దీనిపై మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు.
భారతీయ రాష్ట్ర సమితి(BRS) పార్టీ సంచలన నిర్ణయం తీసుకొంది. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఖమ్మంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఈ ఇద్దరు నేతలు పార్టీపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే వీరి మాటలను సిరీయస్ గా తీసుకున్న గులాబీ బాస్ సీఎం కేసీఆర్ పార్టీ నుంచి వారిని సస్పెండ్ చేశారు. బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ కి గురైన జూపల్లి కృష్ణారావు సంచలన కామెంట్స్ చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫోటో మీ ఇంట్లో ఎందుకు ఉందని కేసీఆర్ ప్రశ్నించాడంటూ జూపల్లి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై బీఆర్ఎస్ అధిష్టానం సస్పెన్ష్ వేటు వేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు వారిద్దరిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. బీఆర్‌ఎస్ అధ్యక్షుడు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకే వారిపై ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం తెలిపింది. అయితే బీఆర్ఎస్ పార్టీ తనను సస్పెండ్ చేయడంపై జూపల్లి కృష్ణారావు స్పందించారు. జూపల్లి కృష్ణారావు మీడియాతో మాట్లాడుతూ..” పార్టీ నుంచి సస్పెండ్ చేయడం సంతోంగా ఉంది. పంజరం నుంచి పక్షి బయటకు వచ్చినట్లుగా ఉంది. మూడేళ్లుగా సభ్యత్వం పస్తకాలు నాకు ఇవ్వలేదు. దీంతో పార్టీ సభ్యుడిగా నేను ఇన్నాళ్లు ఉన్నట్టా? లేనట్టా?. బీఆర్ఎస్ నేతలు నన్ను సస్పెండ్ చేస్తే.. చేశారు.. కానీ నా మాటలకు సమాధానం చెప్పి చేయాల్సింది.
బీఆర్ఎస్ నేతల బండారం బయటపడుతుందని నన్ను సస్పెండ్ చేశారు. ముఖ్యమంత్రి అంటే ప్రభుత్వ ఖజానాకు ధర్మకర్త ఉంటారు. ప్రతి పైసా ఆచుతూచి ఖర్చు పెట్టాలని నేను చెప్పిన. నేను తెలంగాణ కోసం ఎంతో పోరాటం చేశాను. గతంలో కేసీఆర్ మా ఇంటికి వచ్చినప్పుడు వైఎస్సాఆర్ ఫోటను చూశారు. ఆయన ఫోటో ఉందేంటి అంటూ ప్రశ్నించారు. ఆనాడు రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఫోటోను పెట్టుకున్నాడు. ఆయన సీఎంగా లేకుంటే ఫోటో తొలగించాలా?. కేసీఆర్ ఫోటో కూడా నా ఇంట్లో ఉంది. అంటే మా ఇంట్లో ఎవరి ఫోటో ఉండాలో మీరు చెప్తారా? . నాకు రాజకీయాలు కొత్తేమి కాదు. నేను కాంగ్రెస్ నుంచి గెలిచా, మరోసారి స్వతంత్ర అభ్యర్థిగా కూడా గెలిచాను” అంటూ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అయితే పొంగులేటి, జూపల్లిలు బీఆర్ఎస్ పార్టీకీ వ్యతిరేకంగా మాట్లాడటం వెనుక ఎవరు ఉన్నారనే సందేహం వ్యక్తం అవుతుంది. గతంలో పొంగులేటి శ్రీనివాస రెడ్డి వైఎస్సార్ సీపీ తరపును ఖమ్మం ఎంపీగా పోటీ చేసి గెలిచారు. జూపల్లి కూడా రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఇండిపెండెంట్ గా గెలిచి.. ఆ తరువాత వైఎస్సాఆర్ కు మద్దతుగా నిలిచారు. ఇలా వైఎస్సాఆర్ తో సంబంధం ఉన్న నేతలను సస్పెండ్ చేయడంపై రాజకీయ విశ్లేషకులు అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే ఏపీలోకి బీఆర్ఎస్ వచ్చినట్లు, వీరిద్దరి రూపంలో తెలంగాణాలోకి వైఎస్సాఆర్ సీపీ వస్తుందేమో అని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.