హీరో సాయిధరం తేజ్ రోడ్డు ప్రమాద ఘటన తీవ్ర చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో సాయితేజ్ ప్రమాద ఘటనపై టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ పీఆర్ఓ మహేశ్ కోనేరు సమగ్రంగా వివరణ చేశారు. సాయితేజ్ నడుపుతోంది పెద్ద బైక్. దాని శక్తి చాలా ఎక్కువ. రోడ్డు ఉపరితలంపై ఇసుక ఉండడంతో వెనుక టైరుకు పట్టు చిక్కలేదు. ఇది చాలా సాధారణమైన యాక్సిడెంట్. బైకులు నడిపేవాళ్లకు ఇలా జరగడం కామన్. అంతేతప్ప., సాయితేజ్ కు యాక్సిడెంట్ జరిగింది ర్యాష్ గా బండినడపడం వల్లో, ఓవర్ స్పీడ్ తో వెళ్లడం వల్లో కాదు. సాయితేజ్ వాడింది 700 సీసీ బైక్. 300 కిమీ వేగంతో వెళ్లడం దానిపై అసాధ్యం. ఆ బైకు వెనుక టైరుకు తగినంత బటన్ లేదని కొందరు అంటున్నారు. కానీ అది తప్పు. ఆ టైరు డిజైన్ అత్యంత భద్రమైనది. సాధారణ రోడ్లపై అది ఎంతో గ్రిప్ ను ఇస్తుంది.
రోడ్డుపై ఇసుక ఉండడంతోనే జారిపోయింది. సాయితేజ్ ముందు ఓ ఆటో, బైక్ వెళుతూ ఇసుక కారణంగా స్లో అయి దిశ మార్చు కోవడంతో, సాయితేజ్ ఆ విషయాన్ని గుర్తించి తన బైకును స్లో చేసి వాటి పక్క నుంచి వెళ్లేందుకు ప్రయత్నించాడని మహేశ్ కోనేరు వివరించారు. కానీ ఇసుక కారణంగా సాయితేజ్ బైక్ స్కిడ్ అయిందని తెలిపారు.ఈ ఘటన దురదృష్టవశాత్తు జరిగినట్టు భావించాలి. రోడ్డుపై ఇసుక ఉండడం, అదే సమయంలో వేరే వాహనాలు అడ్డు రావడం ప్రమాదానికి దారితీశాయి. ఆ సమయంలో సాయితేజ్ హెల్మెట్ ధరించి ఉన్నాడు. అతని వరకు ఎలాంటి పొరపాటు చేయలేదు. అందుకే అతడిని తప్పుబట్టడం మానేద్దాం. అతడిని, అతడి కుటుంబ సభ్యుల గౌరవానికి భంగం కలగకుండా వ్యవహరిద్దాం.
యాక్సిడెంట్లు ఎవరికైనా జరుగుతాయి. అంతమాత్రాన ప్రతి యాక్సిడెంట్ కు ర్యాష్ డ్రైవింగ్ కారణమని చెప్పలేం. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేద్దాం” అని పేర్కొన్నారు.
If you see the video, auto and the bike slowed down considerably, probably due to the same stretch of sand/dirt. From what I could see, SDT also slowed down to avoid the bike and auto and swerved around them pic.twitter.com/YFBSfN6jcD
— Mahesh Koneru (@smkoneru) September 12, 2021