మరణం.. మరణం.. ఈ పదం తలిస్తేనే ఒళ్లు జలదరిస్తుంది. ఎక్కడ మృత్యువు మనల్ని కాటేస్తుందో అని.. అలాంటిది గుండెపోటుతో ఎవరికివారు.. ఎక్కడిక్కడ ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా, ఒక యువకుడు క్రికెట్ ఆడుతూ నిలబడ్డచోటునే కుప్పకూలిపోయాడు.
గుండెపోటు.. ఈ పేరు చెప్తేనే జనాలు భయపడిపోతున్నారు. ఇటీవల కాలంలో చోటుచేసుకున్న వరుస విషాదాలే అందుకు కారణం. జిమ్‌లో వర్కౌట్లు చేస్తూ ఒకరు, గ్రౌండ్లో షటిల్ ఆడుతూ మరొకరు, పెళ్లి పీటల మీద ఇంకొకరు, పెళ్లి బరాత్‌లో డ్యాన్స్ చేస్తూ యువకుడు.. విధుల్లో ఉన్న బస్ కండక్టర్, కాసేపట్లో పెళ్లనగా పెళ్లికూతురు.. ఇలా ఎక్కడిక్కడ.. ఎవరికి వారు గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. అందులోనూ.. అప్పటివరకు ఆరోగ్యంగా ఉన్న వారు సైతం అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోతుండటం గమనార్హం. తాజాగా, ఓ యువకుడు అలానే ప్రాణాలు కోల్పోయాడు.
అప్పటివరకు స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతూ పరుగులు పెట్టిన యువకుడు.. ఉన్నట్టుండి కుప్పకూలాడు. ఈ విషాద ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. ఆ వివరాలు.. మల్లాపూర్ మండలం గొర్రెపల్లికి చెందిన కొంపెల్లి రాజవిష్ణు(34) స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అప్రమత్తమైన తోటి మిత్రులు అతడిని మెట్‌పల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు మరణించినట్టు తెలిపారు. విష్ణుకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు సంతానం. స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడటానికి వెళ్లిన భర్త, కానరాని లోకాలకు వెళ్లడంతో అతని భార్య గుండెలు పగిలేలా రోదించింది. అందరిని నవ్విస్తూ.. కలిసిమెలిసి మెలిగే అతడు మృత్యువాతపడటం తోటి స్నేహితులను, గ్రామస్థులను సైతం కంటతడి పెట్టించింది. ఈ విషాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన యువకుడి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని మనమూ కోరుకుందాం.. వరుసగా చోటుచేసుకుంటున్న గుండెపోటు మరణాలకు కారణం ఏమనుకుంటున్నారో.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.