ఎంఎస్ ధోని.. క్రికెట్ ప్రపంచంలో అత్యుత్తమ ఫినిషర్. ఎంత ఒత్తిడి ఉన్నా కూల్‌గా షాట్లు బాది తనదైన శైలిలో మ్యాచ్‌ను ముగించడంలో తనకు తానే సాటి. ఐపీఎల్-2022లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మరోసారి ఈ విషయాన్ని నిరూపించాడు ధోని భాయ్. చివరి ఓవర్.. చెన్నై గెలవాలంటే 4 బంతుల్లో 16 పరుగులు కావాలి. స్ట్రైక్‌లో ధోని ఉన్నాడు.. ఇంకేముంది. మూడో బంతి సిక్స్, నాలుగో బంతి ఫోర్, ఐదో బంతికి రెండు పరుగులు.. చివరి బంతికి ఫోర్ కొట్టిన ధోని.. మ్యాచ్‌కు షాకింగ్ ఫినిషింగ్ ఇచ్చాడు. ధోనీ ఇన్నింగ్‌కు అభిమానులు ఫిదా అయ్యారు. ఓడిపోయే మ్యాచ్‌ను ఒంటిచేత్తో లాక్కొచ్చాడంటూ కితాబులిస్తున్నారు.
ఇది కూడా చదవండి: చివరి ఓవర్‌లో దుమ్ములేపిన ధోని! మరోసారి తనేంటో చూపించాడు
ఈ క్రమంలో ధోనిపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. ధోని ఇన్నింగ్స్‌పై మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో ప్రశంసల వర్షం కురిపించాడు. వయసు కేవలం ఓ సంఖ్య మాత్రమే. ధోని ఓ ఛాంపియన్ క్రికెటర్, అతనో అసాధారణ ఫినిషర్ అని ప్రశంసించారు. రోజురోజుకు ఈ లెజండరీ క్రికెటర్ మరింత పరిణితి చెందుతున్నాడంటూ కేటీఆర్ ధోనిపై ప్రశంసల వర్షం కురపించాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరలవుతోంది.
Age indeed is just a number!!!
What an outstanding finisher this champion is @msdhoni #MSDhoni the legend grows 👏👏
— KTR (@KTRTRS) April 21, 2022
ఇది కూడా చదవండి: IPL లైవ్ ఫ్రీగా చూసేందుకు హాట్ స్టార్ నే హ్యాక్ చేశాడు!
అయితే ఈ మ్యాచ్‌లో చెన్నై విజయంపై ఆ జట్టు కెప్టెన్ రవీంద్ర జడేజాలో చివరి వరకూ అనుమానాలు నెలకొన్నాయట. ఈ విషయాన్ని అతడు మ్యాచ్ ముగిశాక స్వయంగా చెప్పాడు. మ్యాచ్ సాగుతున్న తీరు తనతో పాటు ఆటగాళ్లందరినీ టెన్షన్‌కు గురి చేసిందన్నాడు. గెలుస్తామా? లేదా అనే ఆందోళన చివరి వరకు కొనసాగిందని పేర్కొన్నాడు. అయితే ధోనీ క్రీజ్‌లో ఉన్నాడనే ధైర్యం తమను కుదురుకునేలా చేసిందని వివరించాడు. కాగా టోర్నీలో చెన్నై సూపర్‌కింగ్స్ జట్టుకు ఇది రెండో విజయం కాగా ముంబై ఇండియన్స్ జట్టుకు మాత్రం వరుసగా ఏడో పరాజయం. ధోని ఫినిషింగ్ స్టైల్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: చివరి ఓవర్‌లో దుమ్ములేపిన ధోని! మరోసారి తనేంటో చూపించాడు
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.