Naina Jaiswal: అతి తక్కువ వయసులో పది, డిగ్రీ పూర్తి చేసిన ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ నైనా జైస్వాల్ తాజాగా ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. ఈమె తల్లి భాగ్యలక్ష్మీ జైస్వాల్ కూడా ఎల్ఎల్‌బీ కోర్సు పూర్తి చేసి ఫస్ట్ క్లాస్ మార్కులు సాధించారు. బాగ్ లింగంపల్లిలో ఉన్న బి.ఆర్ అంబేద్కర్ లా కాలేజీలో ఈ ఇద్దరూ చదివారు. తాజాగా ఈ ఇద్దరూ ఒకేసారి ఎల్ఎల్‌బీ కోర్సు పూర్తి చేసి అరుదైన ఫీట్ సాధించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు. నేను, మా అమ్మ భాగ్యలక్ష్మీ జైస్వాల్ మా ఎల్‌ఎల్‌బీ కోర్సు పూర్తి చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. బాగ్ లింగంపల్లిలో బి.ఆర్ అంబేద్కర్ కాలేజీ నుండి ఫైనల్ ఇయర్‌లో ఫస్ట్ క్లాస్‌లో ఉత్తీర్ణత సాధించామని పేర్కొన్నారు.
ఆమె తల్లి పోస్ట్ గ్రాడ్యుయేట్ అని, ఎంఎస్‌సి మైక్రోబయోలజీ పూర్తి చేశారని అన్నారు. కూతురిని మోటివేట్ చేసేందుకు ఎల్ఎల్‌బీ పరీక్షలు రాశారని అన్నారు. ఈ పరీక్షలకు ఇద్దరం కలిసే ప్రిపేర్ అయ్యామని, ఇద్దరం కలిసే కేస్ స్టడీస్‌ని విశ్లేషించుకునే వాళ్ళమని, అదొక అద్భుతమైన అనుభవం అని ఆమె తెలిపారు. ఇద్దరం కలిసి ఇలా పాసవ్వడం తనకెంతో సంతోషంగా ఉందని నై నా జైస్వాల్ అన్నారు. తల్లి, కూతురు ఫ్లవర్ బొకేతో ఒకరినొకరు అభినందనలు తెలియజేసుకుంటున్న ఫోటోను షేర్ చేశారు. నెటిజన్లు అభినందనలు తెలియజేస్తున్నారు. మరి కలిసి పరీక్ష రాయడమే గాక.. ఫస్ట్ క్లాస్‌లో పాసయిన ఈ తల్లీకూతుర్లపై మీ అభిప్రాయన్ని కామెంట్ చేయండి.