ఇటీవల మనిషి ఏ క్షణంలో ఎలా చనిపోతాడో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లో వరుస గుండెపోటు మరణాలు తీవ్ర కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇక రోడ్డు ప్రమాదాల్లో మరణాలు షరా మామూలే అయ్యాయి.
మనిషికి మృత్యువు ఏ రూపంలో వస్తుందో ఎవరూ ఊహించలేకపోతున్నారు. ఈ మద్య తెలుగు రాష్ట్రాల్లో వరుస గుండెపోటు మరణాలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో ఓ అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. భర్త చనిపోయిన విషయం గుర్తించని భార్య నాలుగు రోజుల పాటు మృతదేహంతోనే జీవనం సాగించింది. కుమారుడు ఇంటికి రావడంతో ఈ విషయం బయటకు వచ్చింది. పోలీసులు, బంధువుల తెలిపిన వివరాల ప్రకారం..
వైరా కు చెందిన మృతుడు బోగి వీరభద్రం..వయసు 65 సంవత్సరాలు. రైల్వేలో గ్యాంగ్ మాన్ గా ఇటీవల ఉద్యోగ విమరణ చేసి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు. పెద్ద కుమారుడు, కుమార్తె హైదరాబాద్ లో నివిసిస్తున్నారు. మరో కుమారుడు వెంకటృష్ణ ఖమ్మంలో ఉద్యోగం చేస్తున్నాడు. గత కొంత కాలంగా వీరభద్రం ఆనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఇక వీరభద్రం భార్య మంగమ్మకు కొంత కాలంగా మతి స్థిమితం సరిగా లేదు. ఈ క్రమంలోనే వీరభద్రం నాలుగు రోజుల క్రితం మంచపై పడుకుని అలాగే చనిపోయారు. అయితే పడుకునే ఉన్నాడని భావించిన మంగమ్మ తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. భర్త చనిపోయాడన్న విషయం గుర్తించలేకపోయింది. దీంతో నాలుగు రోజులు మంచపైనే మృతదేహం ఉండటంతో ఉబ్బిపోయి దుర్వాసన రావడం మొదలైంది. అయినా కూడా మంగమ్మ ఏమాత్రం పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటుంది. ఈ విషయం చుట్టుపక్కల ప్రజలు కూడా గమనించలేకపోయారు.
ఎప్పుడూ కొడుకులు, కూతురు తండ్రికి ఫోన్ చేసి యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉండేవారు. వేలకు ట్యాబ్ లెట్స్ వేసుకోవాలని తండ్రికి సలహాలు ఇస్తూ ఉండేవారు. మూడు రోజుల క్రితమే తల్లిదండ్రులతో మాట్లాడిన వెంకటకృష్ణ ఆదివారం ఫోన్ చేయగా మంగమ్మ ఫోన్ లేపి పిచ్చి పిచ్చిగా మాట్లాడటంతో ఇంట్లో ఏదో జరిగిందని అనుమానం వచ్చి వెంటనే తల్లిదండ్రుల ఇంటికి బయలు దేరాడు. తలుపులు తెరిచి చూడగా ఒక్కసారిగా దుర్వాసనతో ఉక్కిరి బిక్కిరి అయ్యాడు. బెడ్ లో రూమ్ లోకి వెళ్లి చూసి షాక్ తిన్నాడు. అప్పటికే వీరభద్రం మృతదేహం ఉబ్బిపోయి కుల్లిపోయే స్థితికి వచ్చింది. వెంటనే కుమారుడు పోలీసులకు సమాచారం అందించాడు. అనారోగ్య కారణాల వల్లనే తండ్రి చనిపోయి ఉంటాడని ఫిర్యాదు చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.