ఈ మద్య తరుచూ విమాన, హెలికాప్టర్ ప్రమాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే టెక్నికల్ ఇబ్బందుల కారణంగా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ టేకాఫ్ అయిన తర్వాత సమస్యలు తలెత్తడంతో పైలెట్లు ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తున్నారు.
ఈ మద్య భూమి పైనే కాదు.. ఆకాశ మార్గాన కూడా ప్రమాదాలు ప్రజల్లో భయాందోళన కలిగిస్తున్నాయి. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పలు విమానాలు, హెలికాప్టర్లు ప్రమాదాలకు గురి అవుతున్నాయి. టెక్నికల్ ఇబ్బందులు, ప్రకృతి వైపరిత్యాల వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్నిసార్లు పైలెట్లు ప్రమాదాలను పసిగట్టి సెఫ్టీగా ల్యాండింగ్ చేయడంతో ప్రయాణీకులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇటీవల దేశీయ విమానయాన సంస్థ ఇండిగోకు చెందిన విమానానికి పలుమార్లు ప్రమాదాలు సంభవించిన విషయం తెలిసిందే. సమయానికి పైలెట్లు ప్రమాదాలను గుర్తించి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తున్నారు. తాజాగా అహ్మాదాబాద్ నుంచి హైదరాబాద్ కు వస్తుండగా ఇండిగో విమానం పెను ప్రమాదం నుంచి బయటపడింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్ కి ఇండిగో విమానం బయలుదేరింది. టేకాఫ్ అయిన కొద్ది సమయం తర్వాత వడగళ్ల వాన కురియడంతో విమానం ముందు భాగం దెబ్బతింది. ఈ సంఘటన విమానం గాలిలో ఉండగానే జరిగింది. దీంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే పైలెట్ ప్రమాదాన్ని హైదరాబాద్ లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం రన్ వే 27L వద్ద విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశాడు పైలట్. దీంతో విమానయాన సిబ్బంది, ప్రయాణికులు అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడుతున్నాయి. కొన్నిచోట్ల వడగళ్ల వానలు కురుస్తున్నాయి. దీంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.
విమానం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో సురక్షితంగా ల్యాండ్ చేయడంతో అక్కడ ఉన్నవారంతా తమ సెల్ ఫోన్లకు పని చెప్పారు.. డ్యామేజ్ అయిన విమానం ఫోటోలు తీశారు. వాటిని సోషల్ మాద్యమాల్లో అప్ లోడ్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇటీవల వరుస విమాన ప్రమాదాలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కాకపోతే పైలెట్లు సమయస్ఫూర్తితో సురక్షితంగా ల్యాండ్ చేయడంతో అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు.
IndiGo Ahmedabad to #Hyderabad Flight 6E 6594 damaged its nose and windshields after it was hit by hail during descent towards RGI Airport. The flight
landed safely at runway 27L with no injuries reported to Passengers or crew. #Weather #hailstorm pic.twitter.com/h88u6fy8hA— Ashish (@KP_Aashish) March 20, 2023
DamagedPassengers