హైదరాబాద్ అభివృద్ధి చెందిన ప్రాంతం అంటారు. ఎలా..? ఒక్క సాఫ్ట్ వేర్ రంగం ఉన్నంత మాత్రాన అభివృద్ధి జరిగినట్లేనా..? ఇది నిన్న మొన్నటి వరకు అందరూ కోడై కూసిన మాట. ఇకపై ఆ మాటలను కట్టి పెట్టాల్సిందే. అందుకు ప్రతిరూపమే.. 'టీ వర్క్స్'. రాయదుర్గం ఐటీ కారిడార్‌లో 18 ఎకరాల్లో అత్యాధునియ సదుపాయాలతో టీ వర్క్స్‌ను నిర్మించారు.
హైదరాబాద్ అభివృద్ధి చెందిన ప్రాంతం అంటారు. ఎలా..? ఒక్క సాఫ్ట్ వేర్ రంగం ఉన్నంత మాత్రాన అభివృద్ధి జరిగినట్లేనా..? ఇది నిన్న మొన్నటి వరకు అందరూ కోడై కూసిన మాట. ఇకపై ఆ మాటలను కట్టి పెట్టాల్సిందే. అందుకు ప్రతిరూపమే.. ‘టీ వర్క్స్’. సాఫ్ట్‌వేర్ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ఇప్పటికే ‘టీ హబ్’ ఉండగా.. హార్డ్‌వేర్ రంగానికి ఊతమిచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ‘టీ-వర్క్స్’ను ఏర్పాటు చేసింది. రాయదుర్గం ఐటీ కారిడార్‌లో 18 ఎకరాల్లో అత్యాధునియ సదుపాయాలతో టీ వర్క్స్‌ను నిర్మించారు. అందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన టీ వర్క్స్‌ను ఫాక్స్ కాన్ చైర్మన్ యంగ్ లియూతో కలిసి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. వినూత్న ఆవిష్కరణలకు వేదికను ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీ-వర్క్స్‌ను నగరంలోని రాయదుర్గంలో 18 ఎకరాల విస్తీర్ణంలో 78వేల చదరపు అడుగులలో సకల సదుపాయాలతో నిర్మించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. “గ్రామీణ ప్రాంత ఔత్సాహిక యువతకు ఈ టీ వర్క్స్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఉత్పత్తుల ఆవిష్కరణలో దేశంలోనే అగ్రగామిగా నిలిచేలా టీ-వర్క్స్‌ను ప్రభుత్వం డిజైన్ చేసిందని, దైనందిన జీవితంలో అవసరమయ్యే వస్తువులను వినూత్నంగా తయారు చేయాలన్న ఆలోచన ఉన్నవారు ఇక్కడకి వస్తే, వారి ఆలోచనలకు అనుగుణంగా వస్తువులను తయారు చేసుకొనే అవకాశం కల్పిస్తామని తెలిపారు”.
హార్డ్‌వేర్ ఉత్పత్తుల తయారీ హబ్.. ‘టీ వర్క్స్’ ఇందుకు పెట్టుబడులతో పని లేదు.. కావాల్సిందల్లా వినూత్నమైన ఆలోచన. మీ వద్ద వినూత్న ఆలోచన ఉంటే.. టీ వర్క్స్ కు విచ్చేసి ఒక పూర్తి స్థాయి ఉత్పత్తి నమూనాతో తిరిగి వెళ్లొచ్చు. అక్కడ అన్ని విధాలుగా సహకరించే యంత్రాంగంతో పాటు యంత్ర పరికరాలను ఉచితంగానే ఉపయోగించుకోవచ్చు. కాగా ఎంపిక ప్రక్రియను ప్రాథమికంగా నిపుణులు నిర్వహించి, వారి ఆలోచనలు ఒక వస్తువుగా తయారు చేసేందుకు అవకాశం ఉందో లేదో అంచనా వేసిన తర్వాత తయారీకి అనుమతిస్తారు. భవిష్యత్తులో అతి తక్కువ మొత్తంలోనే చెల్లించి యంత్రాలను వినియోగించుకోవచ్చు.
భౌతికంగా ఒక వస్తువును తయారు చేయాలంటే చేతితో కాకుండా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన యంత్రాల అవసరం ఉంటుంది. అలాంటి వాటికి వేదికే.. టీ వర్స్. ఇందులో లేజర్ కటింగ్, మిల్లింగ్, డ్రిల్లింగ్, కటింగ్, పాటరీ, సెరామిక్, కార్పెంటరీ, 3డీ, ఎలక్ట్రికల్ టెస్టింగ్, ఎలక్ట్రో మెకానికల్ టెస్టింగ్, పీసీబీల తయారీ, డిజైన్ ఇంజినీరింగ్.. ఇలా మొత్తం 200లకు పైగా మెషీన్స్ అందుబాటులోకి తెచ్చారు. కోట్లాది రూపాయల విలువ చేసే యంత్రాలను దేశ, విదేశాల నుంచి తెప్పించి ప్రయోగాలకు సిద్ధంగా ఉంచారు.
Watch the video on the grand inauguration of @TWorksHyd, India’s largest prototyping centre. #BuildAtTWorks pic.twitter.com/zvDZeB56QO
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) March 3, 2023