స్వరాష్ట్రాన్ని సాధించిన తరువాత ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సిఎం కెసిఆర్ పలు సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించి పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. రైతులకు రైతుబందు, రైతు బీమా కల్పించి వారి కష్టాలను తీర్చారు. వృద్ధులకు పింఛన్లు దేశంలో ఏ రాష్ట్రం ఇయ్యనంతగా 2,016 లు ఇచ్చి వారిపాలిట ఆపద్భాందవుడయ్యారు. కళ్యాణ లక్ష్మీతో పేదింటి ఆడబిడ్డల పెళ్లికి ఆర్థిక సాయం అందించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు మన కళ్లముందు గోచరిస్తాయి. స్వరాష్ట్రం ఏర్పడిన అనతికాలంలోనే సిఎం కెసిఆర్ తన మార్క్ పాలనతో దేశానికే ఆదర్శంగా నిలిపారు. తాజాగా ఓ మీటింగ్ లో పాల్గొన్న సిఎం కెసిఆర్ దివ్యాంగులకు శుభవార్తను అందించారు. దీంతో దివ్యాంగులు ఆనందంలో మునిగిపోయారు.
తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా అట్టహాసంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా మంచిర్యాల జిల్లాలో నిర్వహించిన బిఆర్ ఎస్ ప్రగతి నివేధన సభలో సిఎం కెసిఆర్ ఆసరా పెన్షన్ల గురించి మాట్లాడారు. ఆసరా పెన్షన్లతో వృద్దులు, వికలాంగులు, వితంతువులు, అందరూ సంతోషంగా ఉన్నారని తెలిపారు. అయితే దివ్యాంగులు ప్రస్తుతం తీసుకుంటున్న ఆసరా పింఛన్ ను మరో వెయ్యి రూపాయలు పెంచుతున్నట్లు ప్రకటించారు. పెంచిన పింఛన్ వచ్చే నెల నుంచే అమల్లోకి వస్తుందని సిఎం కెసిఆర్ ప్రకటించారు. ఈ నిర్ణయంతో రూ. 3,116 పింఛన్ అందుకుంటున్న దివ్యాంగులు వచ్చే నెల నుంచి రూ. 4116లు అందుకోనున్నారు. దశాభ్ది ఉత్సవాల శుభసందర్భంగా దివ్యాంగుల పెన్షన్ ను మరో వెయ్యి రూపాయలు పెంచడంతో దివ్యాంగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.