ఐస్ క్రీమ్స్ అంటే ఇష్టపడిని వారు చాలా తక్కువ మందే ఉంటారు. ముఖ్యంగా పిల్లలకు ఐస్ క్రీమ్స్ అంటే ఎంతో ఇష్టం. కొందరు పిల్లలు అయితే రోజు ఐస్ క్రీమ్ కావాలని మారం చేస్తుంటారు. ప్రజల్లో ఉన్న డిమాండ్ ను ఆసరాగా చేసుకుని కొందరు కల్తీరాయుళ్లు నాసిరకం ఐస్ క్రీమ్స్ ను తయారు చేసి.. సప్లయ్ చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లోని కల్తీ ఐస్ క్రీమ్స్ కలకలం రేపింది.
ఐస్ క్రీమ్స్ అంటే ఇష్టపడిని వారు చాలా తక్కువ మందే ఉంటారు. ముఖ్యంగా పిల్లలకు ఐస్ క్రీమ్స్ అంటే ఎంతో ఇష్టం. కొందరు పిల్లలు అయితే రోజు ఐస్ క్రీమ్ కావాలని మారం చేస్తుంటారు. అలానే ఏదైనా శుభకార్యాలు జరిగినప్పుడు అక్కడ తప్పనిసరిగా ఐస్ క్రీమ్ ఉంటుంది. ఇలా ప్రజల్లో ఉన్న డిమాండ్ ను ఆసరాగా చేసుకుని కొందరు కల్తీరాయుళ్లు నాసిరకం ఐస్ క్రీమ్స్ ను తయారు చేసి.. సప్లయ్ చేస్తున్నారు. రసాయనాలతో తయారు చేసిన ఐస్ క్రీమ్స్ లు సప్లయ్ చేసి.. పసి పిల్లలు ప్రాణాలతో చెలగాట మాడుతున్నారు. తాజాగా హైదరాబాద్ లోని చందనగర్ లో కల్తీ ఐస్ క్రీమ్ తయారీ గుట్టు రట్టయింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
తల్లిదండ్రులారా జాగ్రత్తా… మీ ఇంట్లో పిల్లలు ఐస్ క్రీమ్.. ఐస్ క్రీమ్ అంటూ మారం చేస్తున్నారా? అదే పనిగా మీరు పిల్లల కోసం షాప్ కి వెళ్లి అందమైన ప్యాకింగ్ ఉన్న ఐస్ క్రీమ్ కొని తెస్తున్నారా?. అయితే పిల్లల గోల నుంచి తాత్కాలికంగా మీరు ఉపశమనం పొందారు. కానీ.. అలా కొనిస్తున్న ఐస్ క్రీమ్ లో కొన్ని కల్తీవి అని మీకు తెలుసా?. రసాయనాలతో తయారు చేసిన ఐస్ క్రీమ్స్ లను మార్కెట్ లోకి తెచ్చి.. కొందరు కేటుగాళ్లు మీ పిల్లలతో చెలగాటమాడుతున్నారు. ఈ వార్త చదివిన తరువాత అవును నిజమేనని మీరు అనకమానరు.
హైదరాబాద్ లోని చందనగర్ ప్రాంతంలో నకిలీ ఐస్‌క్రీమ్ తయారీ కేంద్రంపై ఎస్.ఓ.టీ. మాదాపూర్ పోలీసులు దాడి చేశారు. ఈ దాడుల్లో శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు ఎలాంటి అనుమతులు లేకుండా ఐదు సంవత్సరాలుగా ఐస్‌క్రీమ్స్ తయారు చేస్తున్నాడు. ఐస్‌క్రీమ్ తయారీ కేంద్రంపై దాడులు చేసిన ఎస్‌ఓటీ పోలీసులు.. పది లక్షల రూపాయల విలువ చేసే మెటీరియల్ స్వాధీనం చేసుకున్నారు. హానికరమైన రసాయనలతో ఐస్ క్రీమ్ లను తయారు చేస్తునట్లు పోలీసులు గుర్తించారు. కల్తీ ఐస్ క్రీమ్లను బ్రాండెడ్ పేర్లతో మోసం చేస్తున్న ఈ ముఠాను పోలీసులు పట్టుకున్నారు.
బ్రాండెడ్ స్టిక్కర్లను అంటించి విక్రయాలు సాగిస్తున్నారని నిర్ధారించారు. అలానే రెండు రోజుల క్రితం నకిలీ చాక్లెట్ల తయారీ కేంద్రం గుట్టు చేసిన విషయం చెలిసిందే. రాజేంద్రనగర్ పరిధి సులేమాన్‌నగర్‌లో ఏవోటీ పోలీసులు జరిపిన దాడుల్లో దిమ్మదిరిగే విషయాలు వెలుగులోకి వచ్చాయి. చాక్లెట్ల తయారీలో హానికర కెమికల్స్ గుర్తింంచారు. తాజాగా కల్తీ ఐస్ క్రీమ్ తయారు చేస్తూ మరో ముఠా పోలీసులకు పట్టుబడింది. మరి.. ఇలాంటి కల్తీరాయుళ్లకు ఎలాంటి శిక్ష విధించాలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.