సరస్వతి దేవి ఎక్కడుంటే అక్కడ లక్ష్మీ దేవి ఉంటుందనడానికి ఈ హైదరాబాదీ అమ్మాయే నిదర్శనం.హైదరాబాద్ మల్కాజిగిరి చెందిన శ్రియా లక్కాప్రగడ అనే విద్యార్థినికి అమెరికాలోని ప్రముఖ కాలేజీలో రికార్డు స్థాయిలో స్కాలర్ షిప్ వరించింది. అమెరికాలోని మాసెచూసెట్స్ లో వెల్లస్లీ సిటీలో ఉన్న వెల్లస్లీ ప్రైవేట్ ఉమెన్స్ లిబరల్ ఆర్ట్స్ కాలేజీలో అడ్మిషన్ కోసం అప్లై చేసిన శ్రియా.. సీటుతో పాటు ఏకంగా రూ. 2.7 కోట్ల స్కాలర్ షిప్ పొంది రికార్డు నెలకొల్పింది.
సైనిక్ పురిలోని భారతీయ విద్యాభవన్ లో పదోతరగతి, డెల్టా కాలేజీలో ఇంటర్ పూర్తి చేసిన శ్రియా.. డెక్స్టెరిటీ గ్లోబల్ మార్గదర్శకత్వంలో అమెరికాలో ప్రముఖ కాలేజీల్లో సీటు కోసం దరఖాస్తు చేసింది. ఈ క్రమంలో పలు అంశాల్లో ప్రతిభ చూపిన శ్రియా.. వెల్లస్లీ కాలేజీలో రూ. 2.7 కోట్ల స్కాలర్ షిప్ కు ఎంపికై చరిత్ర సృష్టించింది.
ఈ సందర్భంగా శ్రియా మాట్లాడుతూ.. కంప్యూటర్ సైన్స్ లేదా సైకాలజీలో డిగ్రీ చదివే అవకాశాలున్నాయని తెలిపింది. కోర్స్ పూర్తి చేసిన తర్వాత మాస్టర్స్ డిగ్రీ కూడా అమెరికాలో పూర్తి చేస్తానని, ఎంఎస్ అయ్యాక స్టార్టప్ ప్రారంభించాలన్న ఆలోచన ఉందని వెల్లడించింది.
గత ఏడాది తెలంగాణకు చెందిన శ్వేతారెడ్డి అనే యువతి కూడా రూ.2 కోట్ల స్కాలర్ షిప్ కు ఎంపికైంది. అమెరికాలోని ప్రతిష్టాత్మకమైన లాఫాయెట్ కాలేజీలో అడ్మిషన్ దక్కించుకోవడమే గొప్ప అనుకుంటే.. శ్వేతారెడ్డి ఏకంగా రూ.2 కోట్ల స్కాలర్ షిప్ కూడా పొందింది. ఏటా ఆరుగురు విద్యార్థులకు మాత్రమే ఈ స్కాలర్ షిప్ అందిస్తుండగా వీరిలో శ్వేతారెడ్డి ఒకరుగా నిలిచారు.
తాజాగా శ్రీయా లక్కాప్రగడ కూడా వెల్లస్లీ కాలేజీలో రూ.2.7 కోట్ల స్కాలర్ షిప్ కు ఎంపికై రికార్డు సృష్టించింది. తెలంగాణ యువత ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పిన శ్రియా లక్కాప్రగడకు అభినందనలు తెలియజేస్తున్నాం. అది శ్రియా లక్కాప్రగడ లెక్కంటే. ఆ మాత్రం ఉండాలి. మరి ఈ చదువుల తల్లి సరస్వతిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Hardik Pandya: ఆ రికార్డ్ క్రియేట్ చేసిన తొలి ఇండియన్ క్రికెటర్‌గా హార్దిక్ పాండ్యా!