టీఆర్ఎస్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న పార్టీ ప్లీనరీకి నగరం మొత్తం గులాబీ మయం అయ్యింది. మాదాపూర్ లోని హెచ్ఐసీసీ హైటెక్స్ లో జరగనున్న ప్లీనరీకి కార్యక్రమానికి సుమారు ఆరు వేల మంది టీఆర్ఎస్ పార్టీ సభ్యులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ప్లీనరికీ వచ్చే వారికి ఈసారి మరుపురాని విధంగా వంటల ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్లీనరీకి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ప్రతినిధులు నగరానికి రానుండటంతో నగరం నలువైపులా స్వాగత తోరణాలు.. పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
నగరంలో జరుగుతున్న ఈ ప్లీనరీలో మాంసాహార, శాఖాహార వంటకాలతో పాటు స్నాక్స్ కూడా పెట్టేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ ప్లీనరీలో తెలంగాణ వంటలు ప్రత్యేకంగా ఉండబోతున్నాయి. వచ్చిన ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలకు కడుపు నిండా భోజనం చేసేలా ఏర్పాట్లు చేశారు. ఈసారి దాదాపు 33 రకాల వంటకాలను మెనూలో చేర్చినట్లు సమాచారం.