తెలంగాణ రాజధానిలో రేపు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. సిటీలోని పలు రూట్లలో ఉండే ఈ ఆంక్షలకు సంబంధించిన పూర్తి సమాచారం మీ కోసం..
హైదరాబాద్ సిటీలో మామూలు టైమ్‌లోనే ట్రాఫిక్ చుక్కలు చూపిస్తోంది. రోడ్ల విస్తరణ, కొత్త బ్రిడ్జిల నిర్మాణం, మెట్రో సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినా ట్రాఫిక్ ఏమాత్రం తగ్గడం లేదు. వీకెండ్స్, ఫెస్టివల్స్ టైమ్‌లోనూ రోడ్లపై వాహనాలు భారీగా జామ్ అవుతున్నాయి. పండుగల సమయంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించడం మామూలే. ఇప్పుడు కూడా బక్రీద్ పండుగ సందర్భంగా గురువారం సిటీలోని పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ముస్లిం సోదరుల ప్రార్థనల నేపథ్యంలో హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు. ప్రార్థనలు నిర్వహించే టైమ్‌లో ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. రేపు నగరానికి వచ్చేవారు పలు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటే ట్రాఫిక్ ఇబ్బందుల నుంచి బయటపడొచ్చు.