హైదరాబాద్ వాసులకు ట్రాఫిక్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఏప్రిల్ 1 నుంచి హైదరాబాద్ లో కఠినంగా ట్రాఫిక్ నిబంధనలు అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ఇప్పటివరకు కరోనా మహమ్మారి దృష్ట్యా చూసీచూడనట్లు నడుచుకున్నామన్నారు. ఇక నుంచి ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తే ఛార్జిషీట్ ఫైల్ చేస్తామని హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ తెలిపారు. హైదరాబాద్ నగరం మొత్తం వాహనాలకు ఒకే స్పీడ్ లిమిట్ ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే ఆ విధానం అమలులోకి వస్తుందని చెప్పారు.
ఇదీ చదవండి: హైదరాబాద్ పోలీస్ మరో ముందడుగు!
ట్రాఫిక్ చలాన్లపై ఇచ్చిన డిస్కౌంట్ కు అనూహ్య స్పందన వచ్చిందన్నారు. 650 కోట్లకు పైగా పెండింగ్ చలాన్లు క్లియర్ అయ్యాయన్నారు. డిస్కౌంట్ పోను దాదాపు రూ.190 కోట్లు వసూలైనట్లు తెలిపారు. డిస్కౌంట్ గడువు పొడిగించే ఉద్దేశం లేదన్నార. ఇంకా ఎవరైనా చెల్లించాల్సి ఉంటే మార్చి 31 లోపే కట్టాలని సూచించారు. ప్రస్తుతానికి 70 శాతం పెండింగ్ చలాన్లు క్లియర్ అయినట్లు తెలిపారు. నిబంధన విషయానికి వస్తే.. డ్రంక్ అండ్ డ్రైవ్ చాలా కఠినంగా అమలు చేస్తున్నట్లు వివరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే నేరుగా జైలుకు వెళ్లాల్సిదేనని తేల్చి చెప్పారు. తాగి వాహనం నడిపే ప్రయత్నం చేయొద్దని హెచ్చరించారు.
వాహనాల అద్దాలపై స్టిక్కర్లు అంటించుకుని తిరిగే అంశంపై కూడా ఆయన స్పందించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. పోలీసు శాఖ ఇచ్చిన స్టిక్కర్స్ మాత్రమే ఉపయోగిచాలని.. వారి ఇష్టానికి స్టిక్కర్స్ అంటిస్తే మోటర్ వెహికిల్స్ యాక్ట్ 177 కింద కేసు నమోదు చేస్తామన్నారు. హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.