మందుబాబులకు షాకిచ్చేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రెడీ అవుతున్నారు. మందుబాబుల బెండు తీసేందుకు సరికొత్త నిర్ణయం తీసుకోబోతున్నారు. ఆ వివరాలు..
మందుబాబులకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కళ్లు బైర్లు కమ్మే వార్త చెప్పారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారికి చెక్ పెట్టడం కోసం.. నగరంలో ప్రతి రోజు డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్‌లు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టెస్ట్‌ల సంఖ్యను పెంచిన ట్రాఫిక్ పోలీసులు.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో మందుబాబులు డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్‌లు తప్పించుకోవడం దాదాపు అసాధ్యం అనే చెప్పవచ్చు. ఇందుకోసం ప్రత్యేక టీమ్‌లను కూడా రంగంలోకి దింపనున్నారు. మరి ఇంతకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తీసుకున్న ఆ సరికొత్త నిర్ణయం ఏంటి అంటే..
ఇక నుంచి హైదరాబాద్‌లో అర్థరాత్రి తర్వత కూడా డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్‌లు నిర్వహించాలని నిర్ణయించారు ట్రాఫిక్ పోలీసులు. అది కూడా హోటళ్లు, బార్లు, పబ్‌లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అర్ధరాత్రి 3 గంటల వరకు కూడా డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు నిర్వహించనున్నారు. ఇవే కాక డ్రంకన్ డ్రైవ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాలతో పాటు మద్యం మత్తులో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్న హాట్‌స్పాట్‌లను గుర్తించారు ట్రాఫిక్ పోలీసులు. ఈ హాట్‌స్పాట్ ప్రాంతాల్లో అర్థరాత్రి 12-3 గంటల వరకు కూడా డ్రంకన్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపనున్నారు.
నగరంలో అర్థరాత్రి తర్వాత చోటు చేసుకునే రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. మద్యం సేవించి.. డ్రైవింగ్ చేయడం కారణంగానే ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి అని భావిస్తున్నారు పోలీసులు. ఈ క్రమంలో అర్థరాత్రి తర్వాత జరిగే రోడ్డు ప్రమాదాలను అరి కట్టడం కోసం డ్రంకన్ డ్రైవ్ టెస్టులను 3 గంటల వరకు కూడా నిర్వహిస్తున్నారు. దీని వల్ల రోడ్డు ప్రమాదాలు కాస్త తగ్గుతాయని పోలీసులు అంచనా వేస్తోన్నారు. ప్రత్యేక బృందాలతో అర్ధరాత్రి డ్రంకన్ డ్రైవ్ టెస్టులు చేయిస్తున్నట్లు అడిషనల్ కమీషనర్ ఆఫ్ పోలీస్(ట్రాఫిక్) జి.సుధీర్ బాబు మీడియాకు స్పష్టం చేశారు.
ఈ ప్రత్యేక బృందాలకు ఇన్‌స్పెక్టర్, సబ్‌ఇన్‌స్పెక్టర్ నేతృత్వం వహించనుండగ.. టెస్టులలో పట్టుబడ్డ వారిపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తారని తెలిపారు. అర్థరాత్రి దాటిన తర్వాత మద్యం తాగి వాహనం నడిపితే డ్రంకన్ డ్రైవ్ టెస్టుల నుంచి తప్పించుకోవచ్చని చాలామంది భావిస్తారు. కానీ ఇప్పుడు 12 గంటల నుంచి 3 గంటల వరకు టెస్టులు చేయడం వల్ల అలాంటి అవకాశం లేదని పోలీసులు చెబుతున్నారు. అలానే 24 గంటలు రోడ్లపై తాము అప్రమత్తంగా ఉంటామని, డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడితే కఠిన చర్యలు ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. మరి ట్రాఫిక్ పోలీసులు తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.