Hyderabad Metro: రాత్రి 11 గంటల వరకు మాత్రమే నడిచే హైదరాబాద్ మెట్రో సేవలను.. తాజాగా మార్పులు చేశారు. అయితే ఈ మార్పులు కేవలం ఒక్క రోజు మాత్రమే.
హైదరాబాద్ వాసుల ట్రాఫిక్ కష్టాలను మెట్రో కాస్త తగ్గించింది. అయితే.. ప్రస్తుతం మెట్రో రైళ్లు సైతం కిక్కిరిసిపోతున్నాయి. దీంతో ప్రారంభంలో ఉన్న మెట్రో టైమింగ్స్‌లో మార్పులు చేసిన హైదారబాద్ మెట్రో రైల్.. తాజాగా మరోసారి మెట్రో టైమింగ్స్‌ను మారుస్తూ నిర్ణయం తీసుకుంది. సాధారణంగా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మెట్రో సేవలు కొనసాగుతున్నాయి. ఉదయం 6 గంటలకు తొలి మెట్రో ట్రైన్ ప్రారంభం కాగా.. రాత్రి 11 గంటలకు చివరి మెట్రో బయలుదేరుతుంది. అయితే.. ఆదివారం(ఏప్రిల్ 9) మాత్రం రాత్రి 12.30 గంటల వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయి.
అయితే.. ఇది కేవలం ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి మాత్రమే. ఐపీఎల్ 2023లో భాగంగా ఆదివారం ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో రాత్రి 7.30 గంటల నుంచి సన్‌రైజర్స్ హైదరాబాద్-పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ ఉండటంతో మెట్రో ఈ నిర్ణయం తీసుకుంది. మ్యాచ్ చూసేందుకు వచ్చే క్రికెట్ అభిమానుల రద్దీ దృష్ట్యా మార్పులు చేశారు. మ్యాచ్ ముగిసిన తర్వాత ఇళ్లకు వెళ్లేందుకు రాత్రి 12.30 వరకు మెట్రో నడవనుంది. మెట్రో టైమింగ్స్‌తో పాటు ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఉంటాయని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
#TATAIPL2023 Match No. 14#SRH VS #PBKS
🗓 9th April, 2023 | 🕞 7:30 PM#SRHvsPBKS #TATAIPL2023 #IPL #PBKSvSRH pic.twitter.com/6ewbmuidnt
— **Roshu,,RN..❣️🚩 (@RnSrkrider) April 9, 2023