ప్రస్తుతం కాలంలో ప్రయాణలు ఎంత రద్దీగా కొనసాగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. బస్సు, రైళ్లు ఎక్కడ చూసినా ప్రయాణికులతో కిట కిటలాడుతుంది. ప్రజలకు అందుబాటులోకి వచ్చిన మెట్రో ట్రైన్ చాలా తక్కువ కాలంలో గమ్యస్థానాలకు చేర్చుతో మంచి ప్రజాదరణ పొందింది.
హైదరాబాద్ నగరానికి బతుకుదెరువు కోసం ఎంతోమంది వస్తుంటారు. ఇక్కడ జీవనం కొనసాగించే క్రమంలో పలు ప్రదేశాల్లో ఉద్యోగాలు, వ్యాపారాలు నిర్వహిస్తుంటారు. ఇందుకోసం బైకుల్లో, కొందరు బస్సుల్లో, కొందరు మెట్రో రైలులో ప్రయాణిస్తుంటారు. ఇక అడ్వాన్స్ టెక్నాలజీతో నగర ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన మెట్రోరైల్ మంచి స్పీడుతో దూసుకెళ్తోంది. నిత్యం ప్రయాణికులతో రద్దీగా కళకళలాడుతూ ఉండేది. తాజాగా విద్యార్థులకు హైదరాబాద్ మెట్రో శుభవార్త చెప్పింది. వివరాల్లోకి వెళితే..
నేటి సమాజంలో ఎక్కడ చూసినా జనాలు ఉరుకులు..పరుగులు పెడుతున్నారు. చాలా మంది ఉద్యోగాలు చేసే క్రమంలో చాలా దూరం ప్రయాణించాల్సి వస్తుంది. దీంతో బస్సు, ఆటోలు, బైకుల్లో ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. దీంతో ఎన్నో ఇబ్బందులు పడుతూ వస్తున్నారు ప్రజలు. హైదరాబాదు మెట్రో రైలు ప్రాజెక్టు నగరంలో ప్రయాణం వేగవంతం, సౌకర్యవంతం చేసే రైలు సేవలనందిస్తోంది. అడ్వాన్స్ టెక్నాలజీతో నగరవాసులకు అందుబాటులోకి వచ్చిన మెట్రో ట్రైన్ చాలా తక్కువ కాలంలో ప్రజల ఆదరణ పొందిన విషయం తెలిసిందే. కొన్ని సమయాల్లో ప్రయాణికులను రికార్డ్ స్థాయిలో వారి గమ్యస్థానాలకు చేరవేస్తుంది. హైదరాబాద్‌లోని మెట్రోను మరిన్ని ప్రాంతాలకు విస్తరింపజేస్తున్నారు. నగరంలో రద్దీగా ఉండే పలు ప్రాంతాలకు ఇప్పటికే మెట్రో రైలు అందుబాటులోకి వచ్చింది.
మెట్రో ప్రజలకు మరింత చేరువ అయ్యేందుకు కొత్త కొత్త స్కీమ్స్ అందుబాటులోకి తెస్తుంది. ఈ క్రమంలోనే విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై విద్యార్థులకు మెట్రోలో స్టూడెంట్ పాస్ సదుపాయం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఈ స్టూడెంట్ పాస్ నేటి నుంచే అందుబాటులోకి తీసుకు వస్తామని తెలియజేసింది. వేసవి సెలవులు పూర్తి కావడంతో విద్యాసంస్థలు పునఃప్రారంభం కావడతో ఈ ఆలోచన చేసినట్లు తెలిపింది. స్మార్ట్ కార్డు రూపంలో ఇది అందుబాటులోకి రానుంది. ఈ స్టూడెంట్ పాస్ సహాయంతో 20 ట్రిప్పుల చార్జీతో 30 రైడ్స్ చేయొచ్చు. ఈ పాస్ వ్యాలిడిటీ 9 నెలలు.. అంటే జూలై 1, 2023 నుంచి మార్చి 31, 2024 వరకు అందుబాటులో ఉంటుంది. 1998, ఏప్రిల్ 1 తర్వాత జన్మించిన విద్యార్ధులు మాత్రమే ఈ పాస్‌కు అర్హులని పేర్కొంది. ఈ విషయాన్ని మెట్రో రైల్ అధికారిక హ్యాండిల్ ద్వారా తెలిపింది. ఈ పాస్ లు పొందాలంటే.. ఎస్‌ఆర్‌నగర్, జేఎన్‌టీయూ, అమీర్‌పేట, విక్టోరియా మెమోరియల్, దిల్‌సుఖ్ నగర్ స్టేషన్లలో కాలేజీ ఐడీ కార్డు చూపించి ఈ మెట్రో పాస్‌ను పొందవచ్చు.
ఇదిలా ఉంటే ఇప్పటి విద్యార్థులు బస్సులు, ఆటోలు, బైకులులపై విద్యా సంస్థలకు హడావుడిగా వెళ్తూ ఉండేవారు.. ఇలాంటి సమయంలో మెట్రో సౌకర్యం వస్తే ఎలాంటి టెన్షన్ లేకుండా త్వరగా తమ గమ్యస్థానానికి చేరుకోవొచ్చు అని అంటున్నారు. ఇటీవల టీఎస్ఆర్టీసీ స్టూడెంట్ పాస్ రేట్లు అధికంగా పెంచిన విషయం తెలిసిందే. నాలుగు కిలోమీటర్ల దూరానికి గతంలో 165 రూపాలు ఉంటే.. ప్రస్తుతం 450 కి పెంచారు. 8 కిలోమీటర్ల దూరానికి 200 ఉంటే ప్రస్తుతం 600 లకు పెంచారు. 245 ఉన్న బస్ పాస్ రేటు 900 అయ్యింది. ఇక 280 ఉన్న బస్ పాస్ ను 1150 కి పెంచారు. 22 కిలో మీటర్లు ఉన్న దూరానికి 330 ఉన్న బస్ పాస్ ప్రస్తుతం 1350 పెంచిన విషయం తెలిసిందే. ఇంత ఖరీదు చేసి పాస్ కొన్నా.. సరైన సమయంలో విద్యా సంస్థలకు చేరుతారా అన్న గ్యారెంటీ లేకుండా పోతుంది. ఇలాంటి సమయంలో మెట్రో ప్రయాణం అంటే వేగం, సురక్షితం, నో పొల్యూషన్ ఇలా ఎన్నో సౌకర్యాలు ఉంటాయి.. అందుకే బస్సుతో పొల్చుకుంటే మెట్రో ట్రైన్ లో ప్రయాణం చేయడం చాలా వరకు బెటర్ అని విద్యార్థుల తల్లిదండ్రులు సైతం ఆలోచిస్తున్నారు. మెట్రో రైల్ ప్రయాణం వల్ల పిల్లలకు కూడా భద్రత ఎక్కువగా ఉంటుందని ఆలోచిస్తున్నారు.
Introducing the Metro Student Pass.
An ultimate and convenient tool for Hyderabadi Students to ride the metro way.Get a brand new student pass metro card by showing your college ID card, recharge for 20 rides, and get 30 rides in 30 days. School/college-going is now made easier… pic.twitter.com/rHjDhQGPqU
— L&T Hyderabad Metro Rail (@ltmhyd) July 1, 2023