ఫార్ములా- ఈ రేసింగ్.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ పేరు బాగా వినిపిస్తోంది. ఏబీబీ ఎఫ్ఐఏ ఫార్ములా వరల్డ్ ఛాపింయన్ షిప్‌గా దీనిని పిలుస్తుంటారు.
రెప్పపాటులో రయ్.. రయ్.. మంటూ దూసుకుపోయే కార్లు.. అప్పుడప్పుడు గాల్లో కూడా ఎగురుతుంటాయి. మీకు అర్థం అయ్యింది అనుకుంటా నేను ఏ గేమ్ గురించి మాట్లాడుతున్నానో.. అవును నేను చెప్పేది ఫార్ములా వన్ రేసింగ్ గురించే. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉన్న ఈ రేసింగ్ కు ఆతిథ్యం ఇవ్వబోతోంది భాగ్యనగరం. హైదరాబాద్ లో ఫార్ములా ఈ-రేసింగ్ ఛాంపియన్ షిప్ ను నిర్వహించబోతున్నారు. ఫిబ్రవరి 11న ఈ రేసింగ్ జరగనుంది. అందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ-రేసింగ్ కు కావాల్సిన ట్రాక్ ను కూడా సిద్దం చేశారు నిర్వాహకులు. ఇందుకోసం ఫిబ్రవరి 7 నుంచి 12 వరకు నగరంలో ట్రాఫిక్ ఆకంక్షలు కూడా విధించారు పోలీసులు.
అందులో భాగంగానే ఫిబ్రవరి 7వ తారిఖు నుంచి 12 వరకు NTR మార్గ్ ను మూసేస్తున్నట్లు ట్రాఫిక అధికారులు తెలిపారు. ఇక ఇప్పటికే రేసింగ్ జరిగే ట్రాక్ పైకి సాధారణ వాహనాలు రాకుండా ట్రాఫిక్ ను మళ్లించారు పోలీసులు. 11వ తేది రేసింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో.. రేసింగ్ ట్రాక్ మీదకు ఒక్కసారిగా సాధారణ వాహనాలు వచ్చాయి. ట్రాఫిక్ మళ్లించడంతో విపరీతమై రద్దీ ఏర్పడింది. దాంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్స్ సాధారణ వాహనాలను రేసింగ్ కోసం సిద్దం చేసిన ట్రాక్ పైకి డైవర్ట్ చేశారు. దాంతో ఈ-రేసింగ్ నిర్వాహకులు తలలు పట్టుకున్నారు. మరికొద్ది గంటల్లో రేసింగ్ స్టార్ట్ కానున్న క్రమంలో ఇలా జరగడంతో గందర గోళం నెలకొంది. రేసింగ్ జరుగుతుందా? లేదా? అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇక వాహనాలను అనుమతించిన కానిస్టేబుల్స్ పై అధికారులు చర్యలకు ఆదేశించారు. ఈ ఫార్ములా ఈ-రేసింగ్ లో 11 జట్లు పాల్గొననున్నాయి. ఇప్పటికే ఎలక్ట్రిక్ కార్లు సైతం విమానాల్లో ఇక్కడికి చేరుకున్నాయి. ఈ క్రమంలోనే ఇలా జరగడంతో నిర్వాహకులు తలలు పట్టుకున్నారు.
India’s First Formula e-Racing comes to #HappeningHyderabad & Trial runs are being conducted from today#Hyderabad is destination for IT , Pharma, Life Sciences ,Aerospace sectors & now Formula e-Racing joins the League
Racing With Responsibility @FIAFormulaE @KTRTRS pic.twitter.com/rxEa7gQQU5
— Dinesh Chowdary (@dcstunner999) November 19, 2022