ప్రస్తుత కాలంలో మన సమాజంలో ప్రేమ పేరుతో జరుగుతున్న మోసాలకు అంతే లేకుండా పోతుంది. ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను అని మాయమాటలు చెప్పడం.. ఆ తర్వాత ముఖం చాటేయ్యడం ఈ రోజుల్లో పరిపాటిగా మారింది. ఒకప్పుడు బాధితుల్లో ఆడవారు మాత్రమే ఉండేవారు. కానీ ఇప్పుడు ఈ జాబితాలో మగవారు కూడా చేరుతున్నారు. ఇక గతంలో ప్రేమించిన వాడు మోసం చేస్తే.. ఆ బాధను మనసులోనే దిగమింగుకుని.. కుమిలిపోయేవారు. కానీ ఇప్పుడు అలా ఊరుకోవడం లేదు. మోసం చేసిన ప్రియుడి ఇంటికి వెళ్లి మరి నిలదీస్తున్నారు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి మరీ ప్రేమించిన వాడిని దక్కించుకుంటున్నారు. ఇప్పుడు మీరు చదవబోయే వార్త కూడా ఈ కోవకు చెందినదే. కాకపోతే ఓ ట్విస్ట్ ఉంది. ఓ యువకుడు ప్రేమించిన యువతిని కాదని.. మరోకరిని వివాహం చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న ప్రియురాలు.. అతడికి ఇంటికి వచ్చి రచ్చ చేయడమే కాక బలవంతంగా అతడి చేత తాళి కట్టించుకుంది. ఈ వింత సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆ వివరాలు..
రామంతపూర్‌లో నివాసం ఉండే శ్రీకాంత్ అనే యువకుడికి ఓ యువతితో పరిచయం ఏర్పడి.. ప్రేమకు దారి తీసింది. కొన్ని రోజుల వరకు బాగానే ఉన్నారు. ఆ తర్వాత శ్రీకాంత్ ప్రేమించిన యువతిని కాదని మరోకరిని వివాహం చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న శ్రీకాంత్ ప్రియురాలు.. అతడి జాడ తెలుసుకుని.. తన కుటుంబ సభ్యులను తీసుకుని.. అతడి ఇంటికి వచ్చింది. తనను ఎందుకు మోసం చేశావని ప్రశ్నించింది. ఇప్పుడు తన పరిస్థితి ఏంటని నిలదీసింది. అందుకు శ్రీకాంత్.. తన చేతుల్లో ఏం లేదని.. తనకు వివాహం జరిగిందని తెలిపాడు. కానీ అతడి ప్రియురాలు, ఆమె కుటుంబ సభ్యులు అందుకు అంగీకరించలేదు. శ్రీకాంత్‌ను చితకబాదడమే కాక.. తమ బిడ్డను పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేశారు. వీరికి మహిళా సంఘాల మద్దతు కూడా తోడవ్వడంతో శ్రీకాంత్ ఇంటి వద్ద పెద్ద రచ్చ జరిగింది.
ఇది కూడా చదవండి: Husband: బైక్ కే బోర్డు తగిలించుకోని తిరుగుతున్న భార్య బాధితుడు! వీడియో వైరల్..
మహిళ సంఘం సభ్యులు, ప్రేమించిన అమ్మాయికి సంబంధించిన పెద్దలు, శ్రీకాంత్ ని చితకబాది, ప్రేమించిన యువతితో మే 27న బలవంతపు వివాహం చేశారు. శ్రీకాంత్‌కి ఇష్టం లేని పెళ్లి చేస్తున్న వీడియోలు వైరల్ గా మారడంతో అతడికి బలవంతంగా వివాహం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన కుటుంబ సభ్యులు ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: clubs:హైదరాబాద్ లో అది పేరుకే పబ్బు..! ఒక్కసారి లోపలికి అడుగు పెడితే చుట్టూ అమ్మాయిలే!