హైదరాబాద్ లోని భోలక్‌పూర్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ప్లాస్టిక్ స్క్రాప్ గోడౌన్ లో మంటలు చెలరేగడంతో స్థానిక జనావాసాల మధ్య ఆందోళనకర వాతావరణం నెలకొంది. గోడౌన్ లో ఎగిసి పడుతున్న మంటలు ఆర్పేందుకు ఫైర్ ఇంజన్ లు అక్కడికి చేరుకోగా.. గల్లీలోకి వెళ్లేందుకు దారిలేక ఫైర్ సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు.
ఇప్పటికే ఘటనా స్థలానికి అధికారులు 3 ఫైర్ ఇంజన్ లను పంపినట్లు తెలుస్తుంది. జనావాసాల మధ్య మంటలు ఎగిసి పడుతుండడంతో.. మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా కష్టపడుతోంది. అధికారులు గోడౌన్ చుట్టుపక్కల జనాలను ఇళ్ల నుండి ఖాళీ చేయిస్తున్నారు. గోడౌన్ లో ప్లాస్టిక్ ఎక్కువగా ఉండటంతో మంటలు అధికంగా చెలరేగుతున్నాయి. మరి ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరి భోలక్ పూర్ అగ్ని ప్రమాదంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.